డొనాల్డ్ ట్రంప్ విజయంతో.. ఆ దేశంలో కీలక పరిణామం!
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించడంతో ఆ దేశంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. అబార్షన్ మాత్రలకు భారీగా డిమాండ్ పెరిగింది. ఒక్క రోజులోనే వీటి కోసం 10వేలకు పైగా అభ్యర్థనలు వచ్చినట్లు తెలిసింది. ఇది రోజూ ఉండే డిమాండ్ కంటే 17రెట్లు ఎక్కువట. ట్రంప్ అధికారంలోకి వస్తే గర్భ విచ్ఛిత్తి హక్కును నిషేధిస్తారనే వదంతలు రావడంతో ఈ మాత్రల కొనుగోళ్లు భారీగా పెరిగినట్లు వ్యాపార వర్గాలు భావిస్తున్నాయి. దీంతో పాటు గర్భ నిరోధక పరికరాలు, కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సతల గురించి తెలుసుకొనేందుకూ ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారని సమాచారం.






