అక్రమంగా అమెరికాలోకి ప్రవేశిస్తున్న భారతీయులు… గంటకు
భారత్‌ను వీడి అమెరికాలో స్థిరపడాలనే కలను నెరవేర్చుకునేందుకు కొందరు అక్రమ మార్గాలను ఎంచుకుంటున్నారు. ప్రమాదకర మార్గాల్లో ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. వేలాది మంది అరెస్టయి అక్కడి జైళ్లలో మగ్గుతున్నారు. ఇలాంటి వారిలో ప్రధాని నరేంద్ర మోదీ సొంత రాష్ట్రం గుజరాత్‌కు చెందిన వారే ఎక్కువగా ఉంటున్నారు. యూఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ (యూఎస్-సీబీపీ) డాటా ప్రకారం గత అమెరికా ఆర్థిక సంవత్సరం ( అక్టోబర్ 1, 2023 నుంచి సెప్టెంబర్ 30, 2024) మధ్యకాలంలో అమెరికాలోకి అక్రమంగా ప్రవేశిస్తున్న 29 లక్షల మందిని భద్రతా సిబ్బంది పట్టుకున్నారు. వీరిలో 90,415 మంది భారతీయులు ఉన్నారు. అంటే దాదాపు గంటలకు 10 మంది భారతీయులు అక్రమంగా అమెరికాకు వెళ్లేందుకు ప్రయత్నిస్తూ దొరికిపోతున్నారు. పట్టబడ్డ భారతీయుల్లో గుజరాత్‌కు చెందిన వారే దాదాపు 50 శాతం మంది ఉన్నట్టు తెలుస్తున్నది.






