అమెరికాలో కాల్పులు.. ఐదుగురి మృతి
అమెరికాలో తుపాకీ కాల్పులకు ఐదుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. కన్సాస్‌లోని విచిటాలో ఓ ఇంట్లో కాల్పులు చోటు చేసుకున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఘటనా స్థలికి వెళ్లిన పోలీసులకు ఆ ఇంట్లో ఓ వ్యక్తి విగతజీవిగా కనిపించాడు. దర్యాప్తులో భాగంగా పరిసరాల్లో గాలించగా మరో ఇంట్లో ముగ్గురు వ్యక్తుల మృతదేహాలు కనిపించాయి. ఇంకో ఇంటి కిటికీలో నుంచి చూడగా లోపల మరో మృతదేహం కనిపించింది. మృతులంతా ఒకరికొకరు తెలిసినవారే అయి ఉండొచ్చని, అయితే వారి మధ్య సంబంధం ఎంటన్నది తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు. మృతుల్లో ఒకరు నిందితుడు అయి ఉండొచ్చని భావిస్తున్నామన్నారు.






