అమెరికాలో హాలోవీన్ వేడుకల్లో .. కాల్పులు
అమెరికాలో హాలోవీన్ వేడుకల సమయంలో వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన కాల్పుల్లో అయిదుగురు మృతి చెందారు. మొత్తం తొమ్మిది మంది గాయపడ్డారు. ఫ్లోరిడా రాష్ట్రంలోని ఓర్లాండ్ నగరంలో హాలోవీన్ వేడుకలు జరుగుతున్న సమయంలో ఓ దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ దాడుల్లో ఇద్దరు మృతి చెందగా మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఓ 17 ఏళ్ల యువకుడిని అనమానితుడిగా అరెస్టు చేసి విచారిస్తున్నట్లు పేర్కొన్నారు. కొలరాడోలోని డెన్వర్ నగరంలోనూ హాలోవీన్ సంబరాలు జరుగుతున్న సమయంలో కాల్పులు చోటుచేసుకున్నాయని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా, మరో ముగ్గురు గాయపడినట్లు వెల్లడిరచారు.






