మార్చి 27న డల్లాస్ లో నాటా ఉమెన్స్ డే సెలెబ్రేషన్స్

ఎక్కడ స్త్రీలు గౌరవించబడతారో, అక్కడ దేవతలు పూజలందుకొంటారు. ఎక్కడ స్త్రీలు గౌరవించబడరో, అక్కడ ఎంత గొప్ప సత్కార్యాలైననూ ఫలించవు అని మనుస్మృతి తెలుపుతుంది.
మహిళ.. ఒక అమ్మగా జన్మనిస్తుంది. ఒక భార్యగా బాధ్యతలను మోస్తూ.. ఓ అక్కగా కష్టాల్లో తోడు నిలుస్తుంది… ఒక చెల్లిగా స్నేహాన్ని.. చిలిపి అల్లర్లను పరిచయం చేస్తుంది.. ఒక కుతురిగా ప్రేమను పంచుతుంది.
ఇలా ఎన్నో రకాలుగా మహిళలు ఏదో ఒకచోట తమ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూనే ఉంటారు. పుట్టినప్పట్టి నుంచి ప్రాణం పోయే వరకు తానంటేనే సేవ.. అనేలా ప్రతి ఒక్క విషయంలో పురుషులకు తోడు నిలుస్తుంటారు స్త్రీలు.
అలాంటి మహిళలందరిని సత్కరించుకోవటం మన బాధ్యత , అందు కోసం NATA March 27, 2022 తేదీన డల్లాస్ లో Subham Event center నందు International Womens Day ని Celebrate చేయబోతోంది
అందులో భాగంగా Motivational Speeches, Cultural Programmes, Fun Activities, Photo Session, Fun Shopping మరెన్నో కార్యక్రమాలు నిర్వహిస్తోంది !!
ఇలాంటి చక్కటి కార్యక్రమాల తో జరగబోయే ఈ కార్యక్రమంలో అందరు పాల్గొని వీక్షించి విజయవంతం చెయ్యాలని కోరుకుంటున్నాము.