జులై 10 వ తేదీన శ్రీ తనికెళ్ళ భరణి గారితో “ముఖా ముఖి” కార్యక్రమం

తెలుగు భాషాభిమానులు, సినీ, సాహితీ ప్రియులకు నమస్కారం:
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA) మరియు ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (TANTEX) సంయుక్తంగా రంగస్థల, సినిమా రచయిత, నటుడు, తెలుగు భాషాభిమాని, బహుముఖ ప్రజ్ఞాశాలి శ్రీ తనికెళ్ళ భరణి గారితో “ముఖా ముఖి” కార్యక్రమం ఇర్వింగ్ మహానగరంలో జూలై 10వ తేదిన మైత్రీస్ ఇండియన్ క్విజీన్, ఇర్వింగ్, టెక్సాస్ లో నిర్వహించబడుతుంది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా, శ్రీ తనికెళ్ళ భరణి‘ గారు విచ్చేయుచున్నారు.
సినీ ప్రియులు, సాహితీ వేత్తలు, సాహిత్యాభిమానులు, కార్యకర్తలు, పోషకదాతలు అందరిని తానా(TANA) మరియు టాంటెక్స్ ఆహ్వానిస్తుంది.
ఈ కార్యక్రమానికి మీ అందరూ విచ్చేసి,జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము.
తేదీ: ఆదివారం, July 10, 2022
సమయం: 6:30 PM
స్థలం:
Mythri’s Indian Cuisine
8350 N MacArthur Blvd, #190
Irving, TX 75063
Note: FREE ENTRY, Dinner Included
సతీష్ కొమ్మన
TANA DFW ప్రాంతీయ ప్రతినిధి