గాలిద్వారా కరోనా నిజమే!
కరోనా వైరస్ గాలి ద్వారా వ్యాపించే అవకాశాలను కొట్టి పారేయ్యలేమని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) అంగీకరించింది. వైరస్ గాలిలో కొంతదూరం వ్యాపిస్తున్నదనడానికి ఆధారాలు కనిపిస్తున్నట్టు వెల్లడించింది. అయితే దీనికి సంబంధించి ఇంకా పరిశోధనలు చేయాల్సి ఉందన్నది. కరోనా వైరస్ గాలిలో కూడా వ్యాపిస్తున్నదని, ఈ మేరకు కరోనా నివార మార్గదర్శకాలను అప్డేట్ చేయాలని 32 దేశాలకు చెందిన 239 మంది శాస్త్రవేత్తల బృందం డబ్ల్యూహెచ్వోకు లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే డబ్ల్యూహెచ్వో తాజా ప్రకటన చేయడం గమనార్హం.






