చైనాకు ముందే తెలుసు
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ పంజా విసురుతున్న పరిస్థితుల్లో హాంకాంగ్‌కు చెందిన వైరాలజిస్టు లీమెంగ్ యాన్ సంచలన విషయలు బయట పెట్టారు. కరోనా వైరస్ ముప్పు గురించి చైనాకి కొద్ది నెలలు ముందుగానే తెలుసని ప్రపంచ దేశాల కళ్లు గప్పి దానిని దాచడానికి ప్రయత్నించిందని ఆమె ఆరోపించారు. ప్రభుత్వంలో ఉన్నత స్థాయి లోనే ఇదంతా జరిగిందన్నారు. కట్టుబట్టలతో ప్రాణాలరచేతుల్లో పెట్టుకొని తాను హాంకాంగ్ నుంచి అమెరికాకు పారిపోయి వచ్చానని ఆమె వెల్లడించారు. హాంకాంగ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్‌లో వైరాలజిస్టుగా ఉన్న యాన్ కోవిడ్‌పై పరిశోధనలు చేసిన తొలి శాస్త్రవేత్తల్లో తాను ఒకరినని చెప్పారు.






