వ్యాక్సిన్ తీసుకున్న అమెరికా అంటువ్యాధుల నిపుణుడు

యునైటెడ్ స్టేట్స్ అంటువ్యాధుల నిపుణుడు ఆంధోనీ ఫౌసితో పాటు ఇతర సీనియర్ అధికారులు, ఆరోగ్య కార్యకర్తలు లైవ్‌లో కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమాని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ (ఎన్‌ఐహెచ్) ప్రత్యక్ష ప్రసారం చేసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీకా తీసుకునేలా ప్రతి ఒక్కరినీ ప్రోత్సహించడానికి టీకా తీసుకున్నట్లు తెలిపారు. వ్యాక్సిన్ మనకు రక్షణగా ఉండడంతో పాటు మహమ్మారిని అంతం చేస్తుందని చెప్పారు. 79 ఆంథోనీ ఫౌసీ మోడెర్నా టీకా తీసుకున్నారు. ఈ వ్యాక్సిన్‌కు నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అలెర్జీస్ అండ్ ఇన్ఫెక్షన్ డీసిజెస్ (ఎన్‌ఐఐఐడీ) ఇటీవల అనుమతి ఇచ్చింది. ఫౌసీతో పాటు ఎన్‌ఐహెచ్ డైరెక్టర్ ఫ్రాన్సిస్ కాలిన్స్, ఆరోగ్య కార్యదర్శి అలెక్స్ అజార్ సైతం టీకాలు తీసుకున్నారు.