కేంద్రంలో మరో మంత్రికి కరోనా
కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి కైలాష్ చౌదరికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. ఇటీవలి కాలంలో తనను కలిసిన వారు క్వారెంటైన్లోకి వెళ్లాలని, వైద్య పరీక్షలు చేయించుకోవాలని ఆయన కోరారు. కొన్ని కరోనా లక్షణాలు కనిపించడంతో వైద్య పరీక్షలు చేయించుకున్నా, కరోనా పాజిటివ్ అని వైద్య పరీక్షల్లో నిర్ధారణ అయ్యింది. కాబట్టి ఇటీవల కాలంలో నన్ను కలిసిన వాళ్లంతా క్వారెంటైన్లో ఉండి వైద్య పరీక్షలు చేయించుకోవాలని కోరుతున్నా. నా శ్రేయోభిలాషులందరికీ ధన్యవాదాలు అని చౌదరి ట్వీట్ చేశారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, లో ఫీవర్ కారణంగా తాను ఆస్పత్రిలో చేరానని మంత్రి చెప్పారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తనతో ఏదైనా అత్యవసర పని ఉంటే ఫోన్ చేయవచ్చని ఆయన తన ట్వీట్లో పేర్కొన్నారు.






