తిరుమలలో అర్చకుడిని బలి తీసుకున్న కరోనా…
తొలిసారిగా తిరుమలలో ఒక అర్చకుడు కరోనా కి బలి కావడం ఆందోళన కలిగిస్తోంది. గోవిందరాజల స్వామి ఆలయం నుంచి డిప్యూటేషన్‌పై వెళ్లి గత కొంత కాలంగా శ్రీవారి ఆలయంలో విధులు నిర్వర్తిస్తున్న ఎస్వీ శ్రీనివాసాచార్యులు (45) కరోన వ్యాధికి చికిత్స తీసుకుంటూ గురువారం మృతి చెందారు. దీంతో ఆలయ అర్చకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితిపై చర్చించడానికి వీరంతా గురువారం డాలర్ శేషాద్రితో భేటీ అయ్యారు. కళ్యాణోత్సవ సేవను తాత్కాలికంగా నిలిపేయాలని అచ్చకుల సూచించారు. దర్శన వేళలు కూడా కుదించాలని వీరు డిమాండ్ చేశారు. అర్చకుల డిమాండ్ పై టీటీడీ తర్జనభర్జనలు పడుతోంది. మరోవైపు అర్చకుని కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని టీటీడీ ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి చెప్పారు.






