కరోనా మహమ్మారి, కంగారు పడితే కుంగిపోతారు…
ఈ శతాబ్దంలో ఎదురైన అతి పెద్ద ముప్పు కరోనా మహమ్మారి. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత 1918లో స్పానిష్ ఫ్లూ వచ్చి, ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 5 కోట్లు మంది ప్రాణాలు బలిగొన్న ఉదంతం తర్వాత మానవాళి ఎదుర్కొంటున్న అతి పెద్ద ముపు ఇదే . ఆరు నెలల క్రితం చైనాలోని ఉహాన్ లో కరోనా వైరస్ వెలుగుచూసి ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారనే సంగతి విన్నప్పుడు అదేదో చైనా సమస్యలే …అని అందరూ అనుకున్నారు. కానీ అక్కడ నుంచి శరవేగంగా పొరుగున ఉన్నకొరియా, జపాన్, అక్కడి నుంచి ఇటలీ, స్పెయిన్, పోర్చుగల్, అమెరికా, ఆసియా దేశాలకు విస్తరించింది. ప్రారంభంలో మనకు పెద్దగా ఇబ్బంది ఉండదని మనదేశంలోని కొన్ని వర్గాలు విశ్వసించాయి. దానికి చాలా కారణాలు చెప్పాయి. మనకు కమ్యూనిటీ ఎక్కువని, ఎంఎంర్ వ్యాక్సిన్ తీసుకుంటాం కాబట్టి ఇబ్బంది ఉండదాని, మలేరియా జబ్బు సర్వసాధారణం కాబట్టి అందుకు వినియోగిస్తున్న ‘ హైడ్రోక్సి క్లోరోక్విన్ ’ వాడి ఉండటం వల్ల కరోనా భారతీయుల జోలికిరాదని ఎవోవో వక్రభాష్యాలు చెప్పారు. ఒకవేళ మన దేశానికి ఈ జబ్బు వచ్చిన మూడు నాలుగు నెలలో తగ్గిపోతుందని అనుకున్నారు. అటువంటి వారి అంచనాలన్నింటిని తలకిందలు చేస్తూ, అనూహ్యంగా విస్తరిస్తున్న కరోనా వైరస్ నుచూసి విస్తుపోవటం సగటు భారతీయుడు వంతు అవుతోంది. నిన్నమొన్నటి వరకు అక్కడెవరిగా వచ్చిందంట… పంజాబ్ లో ఒక విదేశీ జంట కరోనా బారిన పడి కోలుకుందంట… చెన్నైలో ఎవరో చనిపోయారాంట అనేది విన్నాం. ఇప్పుడు కరోనామన ఉరికి, మన కాలనికి, మన అపార్టుమెంట్లోకి వచ్చేసింది. మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది. ఆస్పత్రిలో ఎక్కడా బెడ్లు దొరకటం లేదు. హెల్త్ ఇన్సూరెన్స్ కార్డు ఉన్నా, ఆస్పత్రుల యాజమాన్యాలు ఆ కార్డులను అంగీకరించటం లేదు. లక్షలో, రెండు లక్షల్లో క్యాష్ కడితేనే చూస్తాం, అదికూడా బెడ్ ఖాళీ అయితే ఫోన్ చేస్తాం అని చెబుతున్నాయి. మొదట్లో హడావుడి చేసిన రాజకీయ నాయకులు ఇప్పుడు పూర్తిగా కాడి మీదపడేశారు. బతికే వాడు బతుకుతాడు . పోయేవాడు పోతాడు. అనే మందాన వ్యవహరిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో మనం ఎం చేయాలి. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి… ఏ విధంగా ఈ ముప్పునుంచి బయటపడాలి…అనేది ప్రతి ఒక్కరి మదిలో మెదలుతున్న సందేహాలు.
ఒక్కటి మాత్రం సుస్పష్టం. భయపడి సాధించేది లేదు. ఈ మహమ్మారిని దైర్యంగా ఎదుర్కొనటమే , జాగ్రత్తగా ఉండటం, అయినా వస్తే ఏం చేయాలనే ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకోవటం, శాయశక్తులా శ్రమించి దాని నుంచి బయటపడటం …. ఇది ఇప్పుడు ప్రతి ఓక్కరూ చేయాల్సి పని. మనపై విదేశీ దండయాత్ర జరగబోతోందని తెలిసినప్పుడు ఏవిధంగా మనం సన్నాహాలు చేసుకుంటామో అదేవిధంగా తగిన ఏర్పాటు చేసుకొని సిద్ధంగా ఉండటమే చేయగలిగింది. అంతేగాని కంగారు పడుతూ, వాళ్లని వీళ్లని నిందించి ప్రయోజనం లేదు. ఇది జరగాలంటే… కరోనా మహమ్మారిపై మీకు పూర్తిస్థాయిలో అవగాహన ఉండాలి.
ఎందుకంత పెద్ద సమస్య?
ఉదాహరణకు ఎయిడ్స్ వ్యాధి తీసుకుంటే 1981లో ఆఫ్రికాలో వెలుగు చూసింది. రెండేళ్ల వరుకు అదేమిటో ఎవరికీ అర్ధం కాలేదు. హెచ్ఐవి అనే వైరస్ వల్ల ఎయిడ్స్ వ్యాధి సోకుతోందని, ఆ వైరస్ మనిషి రోగ నిరోధక మీద దాడి చేసి మనిషిని అన్ని వ్యాధులకు ఎక్స్ పోజ్ చేస్తుందని ఆ తర్వాత రెండేళ్లకు కానీ అర్ధం కాలేదు.. ఆ తర్వాత దాని చికిత్సకు అనువైన మందులు కనుగొనటానికి రెండు దశాబ్దాలు పట్టింది. అప్పటికి నేరుగా ఎయిడ్స్ వ్యాధిని నివారించే – లేదా- నిర్మూలించే మందులు రాలేదు. దాన్ని అదుపులో పెట్టటానికి మాత్రమే కొన్ని మందులు వచ్చాయి.
కరోనా వైరస్ శాస్త్రవేత్తలకు తెలియనిది కాదు. పిల్లిలో వైరస్ నివాసం ఉంటుంది. ఈ వైరస్ చూడటానికి కిరీటం మాదిరిగా ఉంటుంది .అందుకె కరోనా పేరు వచ్చింది. కరోనా అంటే స్పానిష్ భాషలో కరటం అని అర్ధం. ఈ వైరస్ జంతువుల నుంచి కానీ, మరేవిధంగా కాని మనిసికి సోకదు, కేవలం మనిషి మంచి మనిషికి మాత్రమే. అది కూడా గాలి ద్వారా, శారీరక స్పర్శ్ ద్వారా అంటుకుంటుంది. మరో ప్రత్యేకత ఏమిటంటే ఎంతో వేగంగా విస్తరించే గుణంగా ఈ వైరస్ ఉండటం.
సార్స్ అనే ఒక రకమైన వైరస్ 2004 లో వెలుగు చూసింది. దాన్ని అదుపు చేయటానికి అప్పట్లో శాస్త్రవేత్తలు, ప్రభుత్వాలు నానా తిప్పలు పడ్డాయి. ఏదోలా దాన్ని కొంత మేరకు నిర్మూలించగలిగారు. ఇప్పుడు కనిపిస్తున్న కరోనా వైరస్ సార్స్ కుటుంబానికి చెందిన వైరస్ కావటం గమనార్హం. అందువల్ల దీన్ని ఇప్పుడు సార్స్-కొవ్ -2 వైరస్ అని కూడా అంటున్నారు. అదే కోవలో సార్స్ వ్యాధిని అదుపు చేసేందుకు వినియోగిస్తున్న మందులను తీసుకు వచ్చి కరోనా వైరస్ వ్యాధిగ్రస్తులకు కూడా చికిత్స చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
కరోనా వైరస్ వ్యాధి (కోవిడ్-19) వ్యాధి రాకుండా నిరోధించే ముందు కానీ, టీకా కానీ లేపోవటం పెద్ద సమస్య వచ్చిన తర్వాత దాన్ని అదుపు చేసే ముందు లేదా చికిత్సా విధానం లేకపోవటం ఇంకా పెద్ద సమస్య పైగా ఈ జబ్బు వెలుగుచూసి ఆరు నెలలే అయింది కాబట్టి, దాని చికిత్సకు సరైన మందును ఇంకా శాస్త్రవేత్తలు కని పెట్టలేకపోయారు. కరోనా వైరస్ ను అర్ధం చేసుకోవటానికి దాని జన్యు పటాన్ని ఆవిష్కరించటానికి చాలా సమయం పట్టింది. సాధారణంగా అయితే ఇటువంటి జబ్బులకు అయిదారేళ్లుకు కానీ ముందు కనుక్కోవటం అనేది సాధ్యం కాదు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో సమస్య తీవ్రత దృష్ట్యా ఏడాది లోన ఏదో ఒక చికిత్సను ఆవిష్కరించాలని ప్రపంచ వ్యాప్తంగా పరిశోధకులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.
వచ్చిందని ఎలా తెలుస్తుంది ?
దాదాపు 80 శాతం మందికి తమకు కరోనా వైరస్ సోకిందనే విషయమే తెలియదు. అందులో వారు అందరిలో తిరుగుతూ ఉంటారు. తద్వారా ఇతరులకు ఈ వైరస్ ను అంటించే ప్రమాదం ఉంటుంది. ఇక దాదాపు 15 శాతం మందికి తీవ్రమైన జ్వరం, న్యూమోనియా, కడుపులో నొప్పి, విరోచనాలు, శ్వాస తీసుకోవటం కష్టం కావటం, రుచి-వాసన గ్రహించే శక్తి కోల్పోవటం వంటి లక్షణాలలో కరనా బయట పడుతుంది. తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఇటువంటి వారు ఈ వైరస్ వ్యాధి నుంచి బయటపడవచ్చు. ఇక మిగిలిన 5 శాతం మందికి ఈ వ్యాధి వల్ల ప్రాణాపాయం కనిపిస్తోంది. ఇప్పటికే ఏదైనా దీర్ఘకాలిక జబ్బు ఉన్న వారు, వయస్సు మీద పడిన వారు అయితే… కరోనా వైరస్ సోకితే ప్రాణాలతో బయటపడటం కష్టమనేది ఇప్పటి వరకు మనకు కన్పిస్తుంది.
చిన్న పిల్లల్లో …
మరి చిన్న పిల్లలకు కొంచెం ముప్పే. ఈ వ్యాధి వస్తే తీవ్రమైన ఇబ్బందులు పడవలసి వస్తుంది. ప్రాణాపాయం కూడా ఉండవచ్చు. పెద్ద పిల్లల్లో ఆనవాళ్లు సింటామ్స్ కనిపించవు. వారికి వచ్చినట్లు కూడా తెలియకపోవచ్చు. ప్రాణాపాయం కూడా ఉండదు. ఒకవేళ జ్వరం, ఇతర ఇబ్బందులు వచ్చినా కొన్ని జాగ్రత్తలతో కోలుకోవచ్చు.
నివాస ప్రదేశాల్లో వైరస్ ను నిర్మూలించటం ఎలా?
కొన్ని రసాయనాలు పిచికారీ చేయటం ద్వారా వస్తువులు, కంప్యూటర్లు, పిల్లలు, టేబుళ్లను తరచుగా తుడవటం ద్వారా వైరస్ మన పరిసరాల్లో పాగా వేయకుండా జాగ్రత్త వహించవచ్చు. ఇధనాల్, హైడ్రోజన్ పెరాక్సైడ్, సోడియం హైపోక్లోరైడ్ వంటి రసాయనాలతో శుబ్రం చేయాలి. తరచుగా సబ్బుతో చేతులు కడుక్కోవాలి. చేతులతో మొఖాన్ని తాకకూడదు. ఎవరికీ షాక్ హ్యాండ్ ఇవ్వకూడదు. నమస్తే తో పలకరించండి . కనీసం రెండు మీటర్లు దూరం నుంచి ఇతరులతో మాట్లాడాలి. ఒక మనిషి వద్ద 1-2 నిమిషాల కంటే ఎక్కువ సమయం గడిపితే ఆ మనిషికి అప్పటికే కరోనా వచ్చి ఉంటే, ఆ వైరస్ గాలిలో ప్రయాణం చేసి మనకు సోకుతుంది. అందుకె 1-2 నిమిషాల నిమిషాలు కంటే ఎక్కువ సమయం ఇతరుల వద్ద గడపకూడదు.
శాస్త్రవేత్తలు ఏం చేస్తున్నారు.?
టీకా కనుక్కోవటానికి ప్రపంచ వ్యాప్తంగా విశ్వప్రయత్నాలు జరుగుతున్నాయి. దాదాపు 150 టీకా ప్రయోగాలు (వాక్సిన్ కేండిడేట్స్ అని అంటారు శాస్త్ర పరిభాషలో… ) సాగుతున్నాయి. ఇప్పటికే పలు సంస్థలు క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించాయి. అయితే, ఇవి మార్కెట్లోకి అందుబాటులోకి రావడానికి కొన్ని నెలలు పడుతుంది.
ఇక ఇవి కాక కరోనా సోకినా వారి చికిత్సకు అనువైన ఔషదాల కోసం అగ్రశ్రేణి పార్మా కంపెనీలు చేయని ప్రయత్నం అంటూ ఏదీ లేదు. ఒక పక్క కొత్త ఔషధాల ఆవిష్కరణ పై దృష్టి సారిస్తూనే, మరోపక్క ఇప్పటికే ఉన్న పాత ఔషధాలను కొంత మార్చి కరోనా పై ప్రభావం చూపగలవేమోననే ప్రయోగాలు అధికంగా చేస్తున్నారు. ఈ క్రమంలో వచ్చిన యాంటీ-వైరల్ ఔషదాలే ‘రెమ్‌డెసివిర్’, ‘ఫవిపిరవిర్’, ‘ తోసిలిజుమాబ్’ తదితరాలు … కరోనా వైరస్ నివారణ కోసం హోమియోపతి మరియు ఆయర్వేదం లో కూడా ప్రయోగాలు జరుగుతున్నాయి.
ఏ మందులు వాడుతున్నారు…
అది ఇది అనేం లేదు. ఏది పనిచేస్తుందంటే ఆ మందు ఇస్తున్నారు. వైద్యులు కరోనా రోగులకు ఇప్పటి వరకూ సింప్టమాటిక్ ట్రీటిమెంట్ (అంటే… జబ్బు లక్షణాలకు చికిత్స చేయటం) తప్పించి కరోనా వైరస్ ను అదుపు చేసే మందు ఏది లేదు కాబట్టి, ఈ పరిస్థితిలో జ్వరం వస్తే పారాసెట్మాల్ , గొంతు నొప్పి – దగ్గుకు అజిత్రోమైసిన్, కడుపులో వికారానికి పెంటాప్రజోల్… ఇలా మందులు ఇస్తున్నారు. ఇవే కాకుండా ఇంకా పరిస్థితిని బట్టి వాడుతున్న మందులు ఎన్ని ఉన్నాయి. అవి – ‘హైడ్రాక్సీక్లోరోక్విన్ ‘ (హెచ్ సీ క్యూ). కొన్ని ఎయిడ్స్ మందులు, ‘డెక్సామెథాసోన్’ అనే స్టెరాయిడ్, ‘ఐవెర్‌మెక్టిన్’…, ‘తోసిలిజుమాబ్’ – ఇలా ఎన్నో ఔషధాలు వాడుతున్నారు. కరోనా వైరస్ వల్ల తీవ్రమైన అస్వస్థతకు గురై ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి ప్లాస్మా థెరపీ మరియు ఆక్సిజన్ థెరపీ ద్వారా కూడా చికిత్స అందిస్తున్నారు. వీటీతో పాటు హోమియోపతి మరియు ఆయర్వేదం రోగనిరోధక శక్తి మందులు కూడా వాడుతున్నారు. వీటితో రోగి కోలుకుంటున్నాడా… అంటే, అదృష్టం బాగుంటే బతికి బయటపడుతున్నాడు. లేకపోతే ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి కనిపిస్తోంది.
ఏ కంపెనీలు …
ఒకటా రెండా, వందలాది కంపెనీలు వివిధ దేశాల్లో ప్రయోగాలు చేస్తున్నాయి. యూనివర్సిటీలు కూడా తమ ల్యాబ్ లలో శక్తి మేరకు కరోనా మందు కోసం అన్వేషణ చేపట్టాయి. వీటిలో ఏదో ఒకటి సక్సెస్ అయినా చాలు… కరోనా కథ ముగిసినట్లే. కొన్ని పెద్ద కంపెనీలు : గ్లాక్సోస్మిత్‌క్లైన్ బీచమ్ (జీ ఎస్ కే ) , ఫైజర్ , ఆస్ట్రాజెనెకా ఫార్మా, సానోఫి లిమిటెడ్, నోవార్టీస్, జెనిన్ టెక్ , సెలజీన్ , మోడెర్నా, టోయో ఫార్మా ,ఇనోవియో ఫార్మాస్యూటికల్స్ . కాన్సినో బయోలాజిక్స్. యూనివర్సిటీలు : ఆక్సఫోర్డ్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా , యూనివర్సిటీ ఆఫ్ విస్కన్సిన్. మనదేశంలో భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్, సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా (పూనే).జైడస్ క్యాడిల్లా – వాక్సిన్ తయారీలో నిమగ్నమై ఉన్నాయి. బయోకాన్, గ్లెన్‌మార్క్ ఫార్మా , హెటిరో డ్రగ్స్ , డాక్టర్ రెడ్డిస్, మైలాన్ ఇండియా, జుబిలాంట్ ఫార్మా, స్ట్రిడ్స్ పార్మా లాబ్స్ వంటి కంపెనీలు కరోనా లక్షణాలకు చికిత్స చేసే మందులు తయారు చేస్తున్నాయి.
ప్రపంచ వ్యాప్తంగా కరోనా బాధితులు సంఖ్య ఇప్పటికీ 1.5 కోట్లకు చేరిపోయింది. చనిపోయిన వారి సంఖ్య 6 లక్షల వరకూ ఉంది. ఇవి గణాంకాల్లోకి ఎక్కిన కేసుల వివరాలు. బయటకు రాకుండా చనిపోయిన వారు లేదా బాధితుల సంఖ్య ఇంకెంత ఉంటుందో ? స్పానిష్ ఫ్లూ మాదిరిగా ఈ జబ్బుతో చనిపోయే వారి సంఖ్య 5 కోట్లకు చేరుతుందా? ఇంకా మించిపోతుందా? ఇంకెన్నాళ్లు ఈ జబ్బు విస్తరిస్తుంది. ఎప్పటికీ దీనికి వ్యాక్టీన్ లేదా మందు కనుగొంటారు ?. అనే ప్రశ్నలకి ఇప్పుడు జవాబు లేదు. కానీ మూడు నెలల క్రితం నాటితో పోల్చితే ఇప్పుడు పాజిటివ్ కేసులు , మరణాల సంఖ్యా గణనీయంగా పెరుగుతున్న విషయం మాత్రం వాస్తవం . ఇది ఇంకా రెండు , మూడు నెలల పాటు ప్రజలను ముప్పు తిప్పలు పెట్టాక మానదు . దీనికి కాలమే సమాధానం చెప్పాలి. ఆ లోపు మనం చేయగలిగింది. జాగ్రత్తగా ఉండటమే. పూర్తి సన్నద్ధతతో ముప్పును ఎదుర్కొనటమే చేయాల్సింది. *
కుంగిపోతే ఎలా ?
అయితే పరిస్థితులు చేతులు దాటిపోయాయని , ఇక చేసేదేమి లేదని కుంగిపోతే ఎలా ? తగిన జాగ్రత్తలు తీసుకుంటూ మనం చేయాల్సిన పనులు చేస్తూ , ముందుకు సాగిపోవటమే.ఇప్పటి వరకు ఉన్న అనుభవాలు ప్రకారం – సామాజిక దూరం పాటించటం ద్వారా ఎంతో మేలు ఉన్నట్టు స్పష్టమవుతోంది . కరోనా వచ్చిన మనిషిని కలవకుండా ఉంటె, దాదాపు ఈ ముప్పు నుంచి తపించుకున్నట్లే అవుతుంది .
ఆదే సమయంలో ఇంటా బయటా పూర్తిస్థాయిలో పరిశుభ్రత పాటించటం , తరచూ చేతులు కడుక్కుంటూ ఉండటం , మొబైల్ లో ఆరోగ్య సేతు అప్ ద్వారా కరోనా కేసులు ఆధికంగా ఉన్న ప్రదేశాలకు వెళ్లకుండా ఉండటం, మాస్క్ తప్పనిసరిగా వేసుకోవటం , శానిటైజర్ వాడటం మరియు మన రోగ నిరోధక శక్తిని పెంచుకోవడం ద్వారా కరోనా బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకున్నట్లు అవుతుంది.
ఒకవేళ వచ్చినా బయపడకూడదు. ధీమాగా ఉండాలి . భయపడితే , మానసికంగా కుంగిపోతే కరోనా మహమ్మారిని ఎదుర్కొనటం ఎంతో కష్టం . శరీర లక్షణాలును బట్టి చికిత్స తీసుకోవాలి. ఎక్కువ మందిలో జ్వరం , ఒళ్ళు నొప్పులు , గొంతునొప్పి , కడుపులో వికారం వంటి లక్షణాలు బయటపడుతున్నాయి . వరం రోజులు పాటు ఇంట్లోనే జాగ్రత్తగా ఉంటూ , పోషకాహారం తీసుకుంటూ , విటమిన్ ట్యాబ్లేట్లు వేసుకుంటూ కోలుకునే అవకాశం కనిపిస్తుంది . కొద్దిమందికి ఈ జబ్బు ప్రాణాంతకంగా మారుతోంది .తీవ్రమైన లక్షణాలు ఉన్నవారు ఆస్పత్రిలో చేరి వైద్యుల సలహా మేరకు తగిన మందులు వాడుకుంటే కోలుకోవచ్చు . కొద్దీ మందికి మాత్రం ప్రాణాపాయం కనిపిస్తుంది . కానీ దానికి మనం చేయగలిగింది ఏది లేదు . మం చేతిలో ఉందంతా జాగ్రత్తగా ఉండటం , కరోనా రాకుండా నిరోదించటం, వస్తే …. అప్రమత్తంగా వ్యవహరిస్తూ ఆ జబ్బు నుంచి బయటపడటం. ప్రయత్న లోపం లేకుండా చూసుకోవటమే చేయాల్సింది . మానసికంగా ధైర్యంగా, దృడంగా ఉంటే ఈ వ్యాధిపై తప్పక గెలుస్తారు. అంతేగాని కుంగిపోతే, కూలిపోతారు, జాగ్రత్త .
-ఎల్ మారుతి శంకర్, మేనేజింగ్ డైరెక్టర్,
సెవెన్ సీస్ ఎంటర్టైన్మెంట్ లిమిటెడ్ 98494 55777






