కరోనా లక్షణాలు 6 రకాలు
కరోనా ఇన్ఫెక్షన్ లక్షణాలను ఆరు రకాలుగా వర్గీకరించవచ్చని బ్రిటన్‌లోని కింగ్స్ కాలేజ్ లండన్ శాస్త్రవేత్తలు అంటున్నారు. మార్చి-ఏప్రిల్ మధ్యకాలంలో కరోనా బారినపడిన దాదాపు 1,600 మంది రోగుల్లో బయటపడిన లక్షణాలను ఎప్పటికప్పుడు సేకరించి, ప్రత్యేక అల్గారిథమ్‌తో విశ్లేషించడం ద్వారా ఈ అభిప్రాయానికి వచ్చినట్లు తెలిపారు. కొవిడ్ రోగులను ప్లూ లక్షణాలుంటాయి. జ్వరం ఉండదు, ప్లూ లక్షణాలతో జ్వరం, జీర్ణకోశ సమస్యలు, తీవ్ర ఇన్ఫెక్షన్తో పాటు నీరసం, తీవ్ర ఇన్ఫెక్షన్తో పాటు గందరగోళం, తీవ్ర ఇన్ఫెక్షన్తో పాటు కడుపు నొప్పి, శ్వాస సమస్య అనే ఆరు విభాగాలుగా విభజించవచ్చన్నారు.






