కరోనాకు తొలి టీకా?
కరోనా టీకాపై క్లినికల్ ప్రయోగాలు పూర్తయ్యాయని రష్యాలోని సెచెనోవ్ ఫస్ట్ మాస్కో స్టేట్ మెడికల్ యూనివర్సిటీ ప్రకటించింది. ఇలా ప్రయోగ పరీక్షలు పూర్తిచేసిన తొలిటీకా తమదేనని వెల్లడించింది. ఈ పరీక్షల్లో పాల్గొన్న మొదటి వాలంటీర్ల బృందాని బుధవారం, రెండో బృందాన్ని ఈ నెల 20న డిశ్చార్జి చేస్తామని వివరించింది. రష్యాలోని గమేలెయ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎపిడెమాలజీ అండ్ మైక్రోబయాలజీ అభివృద్ధి చేసిన ప్రయోగాత్మక టీకాపై ఈ వర్సిటీ పరీక్షలు నిర్వహించింది. ఈ పరీక్షలు జూన్ 18న ప్రారంభమయ్యాయి. ఈ వ్యాక్సిన్ సురక్షితమేనని తేలింది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఇతర టీకాల స్థాయిలోనే ఇది కూడా సురక్షితంగా ఉంది అని సెచెనోవ్ వర్సిటీకి చెందిన అలెగ్జాండర్ లుకాషెవ్ పేర్కొన్నారు.






