కోవిడ్ పరిశోధనలపై రష్యా హ్యాకింగ్ ?
కోవిడ్ వ్యాక్సిన్ పరిశోధనల సమచారాన్ని తస్కరించడానికి రష్యా ప్రయత్నిస్తోందని అమెరికా, బ్రిటన్, కెనడా ఆరోపించాయి. రష్యా ఇంటెలిజెన్స్ సర్వీసులో భాగమైన ఏపీటీ29 హ్యాకింగ్ గ్రూపు (కోజీ బేర్) కరోనా వైరస్ టీకా అభివృద్ధిలో పాల్గొంటున్న వైద్య పరిశోధనా సంస్థలు, ఫార్మాస్యూటికల్ సంస్థలపై సైబర్ దాడికి పాల్పడి సమాచారాన్ని హ్యాక్ చేయడానికి ప్రయత్నించిందని ఈ మూడు దేశాలు ఆరోపణలు గుప్పించాయి. పరిశోధనలకు ఆటంకం కలిగించడంతో పాటుగా మేధోపరమైన సమాచారాన్ని తస్కరించేందుకు రష్యా వరుస దాడులకు పాల్పడినట్టు బ్రిటన్ నేషనల్ సైబర్ సెక్యూరిటీ సెంటర్ అంటోంది. అయితే ఎంతవరకు సమాచారం రష్యాకు చేరిందో పూర్తిగా తెలియదని సృష్టం చేసింది.






