అమెరికన్లకే ఎక్కువ ముప్పు
ఇతర దేశాల ప్రజల కన్నా కరోనా వైరస్‌తో మరణించే ప్రమాదం అమెరికన్లకే అధికంగా ఉన్నదని ప్రముఖ వైద్యుడు రోన్ క్లయినర్ పేర్కొన్నారు. అమెరికా మాజీ అధ్యక్షుడు ఒరాక్ ఒబామా హయాంలోనే వైట్‌హౌస్‌లో ఎబోలా రెస్పాన్స్ కో ఆర్డినేటర్టా విధులు నిర్వహించిన ఆయన సీఎన్ఎస్తో మాట్లాడారు. ఈ భూమి మీద అధిక సంఖ్యలో జనాభా ఉన్న దేశాల జాబితాలో అమెరికా కూడా ఒకటి. కరోనాతో ప్రభావితమైన దేశాల జాబితాలో అమెరికా ఉంది. ఇతర దేశస్తుల కన్నా అమెరికన్లే అధిక శాతం కరోనాతో మరణించే ప్రమాదం ఉన్నది అని పేర్కొన్నారు. జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీకి చెందిన సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ (సీఎస్ఎస్ఈ) గణాంకాల ప్రకారం అమెరికాలో మరణాల సంఖ్య లక్షా 60 వేలు దాటింది. కేసుల సంఖ్య దాదాపు 50 లక్షలకు చేరువైంది. కేసులో నమోదులో గానీ, మరణాల్లో గానీ తీవ్రంగా ప్రభావితమైన దేశాల జాబితాలో అమెరికా మొదటి స్థానంలో ఉన్నది.






