మారటోరియం మరో మూడు నెలలు
కొవిడ్ 19 ప్రభావంతో ఆదాయం తగ్గిన/ కోల్పోయిన రుణగ్రహీతలకు ఆర్బీఐ మరోసారి ఊరట కలిగించింది. మార్చి 27న ప్రకటించిన తొలివిడత మారటోరియం ప్రకారం మార్చి, ఏప్రిల్, మే నెలల్లో చెల్లించాల్సిన నెలవారీ రుణకిస్తే (ఈఎంఐ)ని వాయిదా వేయగా, ఇప్పుడు మరో మూడు నెలలు పొడిగించారు. అంటే మారటోరియం ఉపయోగించుకునే వారికి జూన్, జులై, ఆగస్టు నెలల ఈఎంఐ చెల్లించాల్సిన అవసరం ఉండదు. అన్ని వాణిజ్య బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు, గృహరుణ, సూక్ష్మ రుణ సంస్థలు ఇచ్చిన అన్ని రకాల టర్మ్ రుణాలకూ ఇది వర్తించనుంది. మారటోరియానిన ఎంచుకున్న వారి వాయిదాల చెల్లింపు సెప్టెంబరు 1 నుంచి తిరిగి ప్రారంభమవుతుంది.






