వ్యాక్సిన్ ప్రయోగం సక్సెస్: ఆక్స్ఫర్డ్
కరోనా వ్యాధిపై పోరాటంలో భాగంగా తాము రూపొందించిన ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ ప్రయోగం విజయవంతమైందని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ సోమవారం ప్రకటించింది. తొలిదశ ప్రయోగ ఫలితాలు పూర్తి ఆశాజనకంగా ఉన్నాయని వెల్లడించింది. మెడికల్ జర్నల్ ది లాన్సెట్‌లో వ్యాక్సిన్ ప్రయోగ ఫలితాలు ప్రచురితమయ్యాయి. ఈ వివరాల ప్రకారం…
ఈ వ్యాక్సిన్ వైరస్‌ను తట్టుకోవడంలో సమర్ధవంతంగా పనిచేస్తుందని ఆక్స్‌ఫర్ట్ తెలిపింది. గత ఏప్రిల్ 23 నుంచి మే 21 దాకా ఈ ట్రయల్స్ కొనసాగాయి. వ్యాక్సిన్ ఇచ్చిన వారి శరీరంలో యాంటీబాడీస్, తెల్ల రక్తకణాలు బాగా పెరిగాయని వ్యాధి నిరోధక శక్తి బాగా ఇనుమడించిందని ఆక్స్ఫర్డ్ ప్రతినిధులు తెలిపారు. ఈ వ్యాక్సిన్‌కు సంబంధించి రెండు దశల క్లినికల్ ట్రయల్స్ పూర్తయిన నేపధ్యంలో 3వదశ ట్రయల్స్ చేపట్టనున్నారు. మొత్తం మీద కరోనా భయంతో వణుకుతున్న ప్రపంచానికి ప్రతిష్టాత్మక సంస్థ నుంచి వచ్చిన ఈ ప్రయోగ ఫలితం చెప్పుకోదగ్గ ఉపశమనంగానే చెప్పాలి.






