ఓక్లహామ్ గవర్నర్ కు కరోనా పాజిటివ్
ఓక్లహామ్ గవర్నర్ కెవిన్ స్టిట్‌కు కరోనా వైరస్ సోకింది. కాగా, కరోనా సోకిన మొదటి యుఎస్ గవర్నర్ కెవిన్ స్టిట్ కావడం గమనార్హం. స్టిట్ సన్నిహితుడు ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించారు. బుధవారం నిర్వహించిన పరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా నిర్ధారణైందని అన్నారు. ప్రస్తుతం తాను బాగానే ఉన్నానని, బుధవారం కొంత అనారోగ్యంగా ఉండటంతో రెగ్యులర్ పరీక్షల్లో భాగంగా కరోనా పరీక్షలు చేయించుకున్నానని కెవిన్ స్టిట్ చెప్పారు. ప్రస్తుతం తాను స్వీయ నిర్బంధంలోకి వెళుతున్నానని, వర్ఫ్రమ్ హోమ్ చేస్తానని చెప్పారు. గత నెల 20న టుల్సాలో జరిగిన ట్రంప్ ర్యాలీలో కెవిన్ హాజరైన సంగతి తెలిసిందే.






