ఎన్ 95ను 3 సార్లు వాడొచ్చు
ఎన్-95 మాస్క్‌ను ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా మూడుసార్లు ధరించొచ్చని అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా లాస్ ఏంజెలెస్ (యూసీఎల్ఏ) శాస్త్రవేత్తలు సృష్టం చేశారు. కేవలం ఒకసారి మాత్రమే వినియోగించేలా వాటిని డిజైన్ చేసినప్పటికీ, శుభ్రంగా ఉత్కుకొని మూడుసార్లు వాడొచ్చని తాజా అధ్యయనంలో గుర్తించినట్లు తెలిపింది. అయితే మాస్క్ రెస్పిరేటర్ సరిగ్గా, బిగువుగా అమరి ఉండటం తప్పనిసరి అని సూచించారు. ఎన్95 మాస్క్ వస్త్రాన్ని హైడ్రోజన్ పెరాక్సైడ్, అతినీల లోహిత కిరణాలు, ఇథనాల్ స్ప్రే, 70 డిగ్రీల సెల్సీయస్ ఉన్న డ్రై హీట్లతో శుభ్రం చేయగా, వైరస్ పూర్తిగా తొలగిపోయిందని వారు గుర్తించారు.






