మౌత్‌వాష్‌తో వైరస్ పరార్!
కరోనా ఇన్ఫెక్షన్ సోకినవారు మౌత్‌వాష్‌ను కనీసం 30 సెకన్ల పాటు పుక్కిలిస్తే..నోరు, గోంతు భాగాల్లో వైరల్ లోడ్ తగ్గుతుందని జర్మనీలోని రూర్ వర్సిటీ శాస్త్రవేత్తలు అంటున్నారు. దాదాపు 8 రకాల మౌత్‌వాష్‌లతో పరిశోధనలు జరపగా, మూడు రకాలవి ప్రభావవంతంగా పనిచేసి నోటి కణజాలంలో వైరస్ కదలికలను తగ్గించాయని వెల్లడించారు. ప్రధానంగా కరోనా రోగులు, వైద్యులు, ఆరోగ్య సిబ్బంది వీటిని వాడటం ద్వారా వైరస్ నుంచి అదనపు రక్షణ పొందవచ్చని సూచించారు. కరోనా సోకిన వారి నోరు, గొంతు భాగాల్లో వైరష్ క్రియాశీలంగా కదలికలు సాగిస్తుంటుంది. వారు తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు, మాట్లాడినప్పుడు వెలువడే నీటి తుంపరలు మాధ్యమంగా వైరస్ ఇతరులకు వ్యాప్తిస్తుంది. కరోనా సోకినవారు మౌత్‌వాష్‌ను పుక్కిలిస్తే వైరల్ లోడ్ తగ్గి, ఎదుటివారి తుంపరల ద్వారా వైరస్ సోకే ముప్పు తగ్గుతుంది.






