యాంటీ మాస్క్ ‘లూయీ గోహ్మెర్ట్’ కు కరోనా వైరస్ పాజిటివ్
అమెరికా లో ప్రెసిడెంట్ ట్రంప్ తో పాటు కొందరు రిపబ్లికన్ పార్టీ నాయకులు కూడా మొండి గా తమ నాయకుడిని అనుసరిస్తూ మాస్క్ వేసుకొనకుండా కరోనా పట్ల నిర్లక్ష్యం గా ఉంటున్న సంగతి అందరికి తెలిసిందే! అలంటి వారిలో ఒకరైన మాజీ న్యాయమూర్తి 2005 నుండి టెక్సాస్ యొక్క 1 వ కాంగ్రెస్ జిల్లా నుండి యు.ఎస్. ప్రతినిధిగా పనిచేస్తున్న రిపబ్లికన్ పార్టీ సభ్యులు లూయీ గోహ్మేర్ట్ కి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది.మాస్క్ లేకుండా కాపిటల్ లో తిరుగుతున్న టెక్సాస్ రిపబ్లికన్ లూయీ అద్ధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్‌తో కలిసి బుధవారం 29 జూలై ఉదయం టెక్సాస్‌కు వెళ్ళే ముందు వైట్‌హౌస్‌లో ప్రీ-స్క్రీన్‌లో కరోనా వైరస్ పాజిటివ్ నిర్ధారణ అయ్యింది అని తెలిసింది.
66 సంవత్సరాల మిస్టర్ లూయీ జూన్ నెలలో సిఎన్ఎన్తో మాట్లాడుతూ, అతను క్రమం తప్పకుండా కరోనావైరస్ పరీక్షకు హాజరు అవుతున్నందున మాస్క్ ధరించడానికి నిరాకరిస్తున్నట్టు తెలిపారు. . ఒకవేళ కరోనా సోకితే తప్ప తనని మాస్క్ లేకుండా చూడరు అని చెప్పినట్లు సిఎన్ఎన్ పేర్కొంది. అయితే లూయీ మాత్రం తాను కరోనా వ్యాధి లక్షణాలను అనుభవించలేదని, కానీ తనను సంప్రదించిన సహోద్యోగులకు ఈ విషయం తెలియజేసినట్లు మరియు గత వారం లేదా రెండు వారాలగా మాస్క్ వేసుకొనక పోవటం వలన తనకి కరోనా వైరస్ సోకి ఉండవచ్చు అని లూయీ వీడియో ద్వారా ప్రకటించినట్టు తెలిసింది.






