ఆసియాలోనే భారత్ అగ్రస్థానం
భారత్లో కరోనా కేసులు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. గడిచిన 24 గంటల్లో 8,329 కొత్త కేసులు నమోదవగా, 230 మంది మరణించారు. గత కొన్ని రోజులుగా వరుసగా దేశంలో 8 వేలకు పైగా కేసులు నమోదవుతున్న సంగతి తెలిసిందే. కాగా, దేశంలో కేసుల సంఖ్య 1,90,535కి చేరినట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. మొత్తం మృతుల సంఖ్య 5,394గా ఉంది. దేశంలో వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారు 93,322 మంది కాగా, 91,819 మంది కోలుకున్నారు. తాజా కేసులతో భారత్ ప్రపంచంలోనే వైరస్ తీవ్రత అధికంగా ఉన్న దేశాల్లో 7వ స్థానానికి చేరింది. ఈ వరుసలో ఫ్రాన్స్ జర్మనీలను దాటేసింది. మరణాల్లో 13 స్థానంలో ఉంది. 2,32,000 కేసులతో ఇటలీ 6వ స్థానంలో, 1,88 వేల కేసులతో ఫ్రాన్స్ 8వ స్థానంలో ఉంది. మరోవైపు కరోనా కేసుల్లో ఆసియాలోనే భారత్ అగ్రస్థానంలో నిలిచింది.






