కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు కరోనా పాజిటివ్
కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ సీనియర్ నాయకులు అమిత్ షాకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఈ మేరకు అమిత్ షానే అధికారికంగా ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. తనకు కరోనా లక్షణాలు కనిపించడంతో కొవిడ్ పరీక్షలు చేయించుకున్నాను. కొవిడ్ ఫలితాల్లో తనకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిందని పేర్కొన్నారు. తన ఆరోగ్యం బాగానే ఉంది. కానీ డాక్టర్ల సలహా మేరకు ఆస్పత్రిలో చేరినట్లు అమిత్ షా తెలిపారు. ఇటీవలి కాలంలో తనను సంప్రదించిన వారందరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలి. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని అమిత్ షా విజ్ఞప్తి చేశారు.
ఈ నేపథ్యంలో హోం మంత్రి అమిత్ షా త్వరగా కోలుకోవాలని పలువురు కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, పలు రాష్ట్రాలకు చెందిన మంత్రులు, ఎంపీలు, ప్రముఖులు, అభిమానులు ట్విటర్ వేదికగా ఆకాక్షించారు. ఇతర సవాళ్లను అధిగమించినట్లే, దీన్ని కూడా మీరు అధిగమిస్తారు. మీరు త్వరగా కోలుకోవాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను అని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్, ఢిల్లీ ముఖ్యమంత్రులు మమత బెనర్జీ, అరవింద్ క్రేజీవాల్ కూడా హోం మంత్రి త్వరగా కోలుకోవాలని ట్వీట్ చేశారు. వారితో పాటు లద్దాక్ ఎంపీ సెరింగ్ నంగ్యాల్, దక్షిణ బెంగళూరు పార్లమెంట్ సభ్యుడు తేజస్వి సూర్య, కాంగ్రెస్ నాయకుడు అభిషేక్ సింఘ్వీ, అస్సాం మంత్రి హిమంత్ బిశ్వ శర్మ కూడా అమిత్ షా త్వరగా కోలుకోవాలని ఆకాక్షించారు.






