అమెరికాలో కేసులు తగ్గుముఖం!
అమెరికాలో కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పడుతున్నాయి. మాస్కుల ధారణతోనే కొత్త కేసుల్లో తగ్గుదల కనిపిస్తోందని నిపుణులు అంటున్నారు. అమెరికాలో ప్రస్తుతం రోజుకు సగటున 43 వేల కేసులు బయటపడుతున్నాయి. జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ విశ్లేషణ ప్రకారం ఆగస్టు మొదటి వారంతో పోలిస్తే కొత్త కేసుల నమోదులో 21 శాతం తగ్గుదల కనిపించింది. అయితే, రోజూ వెయ్యికిపైగా మరణాలు సంభవిస్తున్నాయి. అమెరికాలో ఇప్పటి వరకు 57 లక్షలకు పైగా కరోనా కేసులు బయటపడగా 1.78 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. 24 గంటల్లో కొత్తగా 40,098 కేసులు నమోదయ్యాయి.
ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకు 2,38,20,104 మందికి వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది. వారిలో 8.18 లక్షల మందికిపైగా చనిపోయారు. ప్రపంచ కేసుల్లో అమెరికాలోనే 57,77,393 ఉన్నాయి. బ్రెజిల్లో కొత్తగా 46 వేలు, రష్యాలో 4,676, దక్షిణాఫ్రికాలో 1,567 మందికి పాజిటివ్ వచ్చింది.






