ప్రపంచంలోనే అతి పెద్ద కొవిడ్ ఆస్పత్రి
ప్రపంచంలోనే అతి పెద్ద కొవిడ్ కేర్ సెంటర్ ఢిల్లీలో ఆదివారం ప్రారంభమైంది. సర్దార్ పటేల్ కొవిడ్ కేర్ సెంటర్ గా పిలుస్తున్న ఈ సెంటర్ను ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ ప్రారంభించారు. ఛతర్పూర్ ప్రాంతంలో ఉన్న ఈ సెంటర్లో 200 ఎన్క్లోజర్లలో 50 బెడ్ల చొప్పున మొత్తం 10 వేల పడకలు ఉన్నాయి. కరోనా రోగులకు ఇక్కడ చికిత్స అందించనున్నారు. దవాఖాన ప్రారంభం సందర్భంగా డీఆర్డీవో డైరెక్టర్ సతీష్ రెడ్డి మాట్లాడారు. చెత్తాచెదారాన్ని డంప్ చేసే స్థలాన్ని చదును చేసి దవాఖానను నిర్మించాం. కరోనాపై పోరులో భాగంగా డీఆర్డీవో ఇప్పటివరకు దేశీయంగా 70 ఉత్పత్తులను తయారుచేసింది. అవసరమైతే రోజుకు 20,000 వెంటిలేటర్లను ఉత్పత్తి చేయగలం. వాటిని ఎగుమతి చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నాం అన్నారు.






