6 అడుగులకు మించి వైరస్ వ్యాప్తి
కరోనా వైరస్ గాలి ద్వారా వ్యాపిస్తుందనడానికి మరిన్ని ఆధారాలు లభ్యమయ్యాయంటున్నారు పరిశోధకులు. దగ్గినప్పుడు, తుమ్మినప్పుడే, అరిచినప్పుడే కాదు, సాధారణంగా మాట్లాడినప్పుడు కూడా వైరస్ వ్యాప్తి చెందుతోందని చెబుతున్నారు. నోట్లోంచి వచ్చే తుంపరల ద్వారా కరోనా వైరస్ బయటకు వస్తోందని, వ్యాధి బారిన పడేయడమే కాకుండా కణాల్లో ఇబ్బడిముబ్బడిగా పెరుగుతోందని యూనివర్సిటీ ఆఫ్ ఫ్లోరిడా పరిశోధకులు చేసిన తాజా అధ్యయనంలో తేలింది. అంతేకాక, ఆరడుగుల భౌతిక దూరం వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు సరిపోదన్న విషయాన్ని తమ పరిశోధనల్లో గుర్తించామని వారు వెల్లడించారు.






