అమెరికాలో వెయ్యికిపైగా మరణాలు…
అమెరికాలో వరుసగా నాలుగో రోజు కూడా వెయ్యికిపైగా కరోనా మరణాలు నమోదయ్యాయి. అయితే, మునుపటితో పోలిస్తే దక్షిణ, పశ్చిమ రాష్ట్రాల్లో పరిస్థితులు కొంత కుదుటపడుతున్నాయని కరోనాపై వైట్‌హౌస్ సలహాదారు ఒకరు తెలిపారు. దేశవ్యాప్తంగా 1,019 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోగా గురువారం 1,140 మంది, బుధవారం 1,135 మంది, మంగళవారం 1,141 మంది కరోనా కాటుకు బలయ్యారు. అలాగే, శుక్రవారం దేశవ్యాప్తంగా 68,800 కేసులు నమోదయ్యాయి. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 4 మిలియన్ల మార్కు దాటేశాయి. తాజాగా నమోదైన కేసుల్లో ఎక్కువశాతం అరిజోనా, కాలిఫోర్నియా, ఫ్లోరియా, టెక్సాస్, కాలిపోర్నియాలో వెలుగుచూశాయి.






