ఏపీఎస్సీ 16 బెటాలియన్ లో కరోనా
కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఆంధప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. అయినప్పటికీ రోజురోజుకూ ఆంధప్రదేశ్ రాష్ట్రంలో కోవిడ్ 19 పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో కృష్ణా జిల్లాలోని గన్నవరం విమానాశ్రయం వద్ద విశాఖపట్నం ఏపీఎస్పీ 16 బెటాలియన్ సిబ్బంది డ్యూటీ చేస్తున్నారు. గన్నవరం విమానాశ్రయం వద్ద 50 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. వీరిలో కొందరికి కరోనా పాజిటివ్ వచ్చిందని వైద్య అధికారులు తెలిపారు. కరోనా సోకిన సిబ్బందిని ఐసోలేషన్‌కు తరలించినట్లు అధికారులు తెలిపారు. మిగతా సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించి విశాఖకు తరలించినట్లు అధికారులు వెల్లడించారు.






