ఎత్తైన ప్రాంతాలపై ప్రభావం తక్కువే!
ప్రాంతాల ఎత్తును బట్టి కరోనా మహమ్మారి ప్రభావం ఆధారపడి ఉంటుందా? ఆస్ట్రేలియా, బొలీలియా, కెనడా, స్విట్జర్లాండ్‌కు చెందిన పరిశోధకులు సంయుక్తంగా చేసిన ఓ తాజా అధ్యయనంలో ఇది నిజమేనని తెలింది. లోతట్టు ప్రాంతాలతో పోలిస్తే, సముద్రమట్టానికి 3,000 మీటర్లు (9,842 అడుగులు) ఎత్తున ఉన్న ప్రాంతాల్లో వైరస్ కేసులు తక్కువగా నమోదవుతున్నట్లు పరిశోధకులు గుర్తించారు. బొలీలియా, ఈక్వెడార్, టిబెట్ దేశాల్లో ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. చైనాతో పోలిస్తే టిబెట్‌లో అతి తక్కువ వైరస్ కేసులు నమోదయ్యాయని, చైనా కంటె టిబెట్ ఎక్కువ ఎత్తులో ఉండటమే దీనికి కారణమని పరిశోధకులు వివరించారు.






