కరోనా నిబంధనలు మార్చేసిన అమెరికా
కరోనా మహమ్మారి సొకితే ఇప్పటి వరకు పాటించవలసిన 14 రోజుల ఐసొలేషన్ను 10 రోజులకు కుదిస్తూ, యుస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ నిబంధనలను ంమార్చింది. ఈ సంవత్సరం మార్చి నుంచి అమెరికాను వైరస్ గడగడలాడిస్తున్న సంగతి విదితమే. కరోనా మహమ్మారిపై పరిశోధనల తరువాత వచ్చిన నివేదికలను పరిశీలించిన సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ కొన్ని సిఫార్సులు చేసింది. కరోనా లక్షణాలు కనిపించిన, జ్వరం బయటపడిన 24 గంటల లోపు నుంచి 10 రోజుల పాటు రోగులు ఐసోలేషన్ అయితే సరిపోతుందని సూచించింది. ఇప్పటి వరకు రెండు సార్లు నమూనాలు ఇచ్చి, అవి నెగటివ్ వస్తేనే ఐసొలేషన్ నుంచి బయటకు రావాలన్న నిబంధన అమలవుతూ వచ్చింది. ఇక గడచిన ఆరు నెలల వ్యవధిలో వచ్చిన నివేదికల్లో వైరస్ బారిన పడిన వారు, చాలా కొద్ది సమయం మాత్రమే ఇన్ఫెక్ట్ అయ్యారని, వారు చాలా తక్కువ రోజుల్లోనే కోలుకున్నారని, నాలుగు నుంచి 9 రోజుల వ్యవధిలోనే అత్యధికులు కోలుకున్నారని పరిశోధకులు పేర్కొన్నారు.






