బీపీ ఔషధాలతో కరోనా తీవ్రత పెరగదు
అధిక రక్తపోటు, హృద్రోగాల ఔషధాలు వాడితే కరోనా రోగుల్లో ఆ వైరస్ తీవ్రత అధికమవుతుందని ఇటీవల కొందరు శాస్త్రవేత్తలు తెలిపారు. అయితే, ఆవాదనను అమెరికా శాస్త్రవేత్తలు కొట్టిపారేశారు. హైపర్‌టెన్షన్, హృద్రోగాలకు సాధారణంగా వాడే ఏసీఈ ఇన్హిబిటర్స్, ఏఆర్‌బీ ఔషధాల వల్ల వైరస్ సోకే ప్రమాదం అధికంగా ఉంటుందన్న వాదనతో పాటు కరోనా రోగుల్లో వైరస్ తీవ్రత పెరుగుతుందన్న వాదన కూడా సరికాదని నార్త్‌వెస్ట్రన్ వర్సిటీ పరిశోధకులు చెప్పారు. అంతేగాక, ఆ ఔషధాలు తీసుకోవచ్చని, వాటి వల్ల కరోనా తీవ్రత తగ్గుతుందని వెల్లడించారు.






