పరీక్షకు రూ.15 వేలు.. పాజిటివ్ వస్తే రూ.75 వేలు ఇస్తారు
కరోనా పరీక్ష చేయించుకుంటే చాలా ఆస్ట్రేలియాలో ప్రభుత్వమే డబ్బిస్తుంది. పరీక్ష జరిగిన వెంటనే సదరు వ్యక్తి ఖాతాలో రూ.15 వేలు జమవుతాయి. అంతేకాదు ఆ పరీక్షల్లో దురదృష్టవశాత్తూ పాజిటివ్ ఫలితమొస్తే కూడా.. ప్రభుత్వం మరో రూ.75 వేలను ఆ వ్యక్తి ఖాతాలో జమచేస్తుంది. కరోనా పరీక్షలను ప్రోత్సహించేందుకు ఆస్ట్రేలియా ప్రభుత్వం ఈ కొత్త స్కీమ్‌ను ప్రవేశపెట్టింది. అయితే ఆస్ట్రేలియాలో కరోనా సమయంలోనూ ఉద్యోగం చేస్తున్న పౌరులకు మాత్రమే ఈ సాయం అందుతుంది. అంతే కాదు అంతకు ముందు ఎలాంటి వ్యాధులూ ఉండకూడదు. దేశవ్యాప్తంగా విస్తరిస్తోన్న కరోనా మహమ్మరిని అరికట్టే క్రమంలో పరీక్షలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.






