కరోనా సంక్షోభంలోనూ ఉద్యోగులకు జీతాలు పెంచిన ఏషియన్ పేయింట్స్
కరోనా మహమ్మారి సంక్షోభం-లాక్డౌన్ ఎన్నో కంపెనీలు వేతనాల్లో కోత లేదా ఉద్యోగుల కోత వైపు మొగ్గు చూపాయి. వేతనాలు తగ్గించని, అలాగే ఉద్యోగులను తొలగించని కంపెనీలు కూడా ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్యోగులకు వేతనాలు పెంచడం అతికొద్ది కంపెనీల్లో మాత్రమే కనిపిస్తోంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లోను ఏషియన్ పేయింట్స్ తమ ఉద్యోగులకు ఇంక్రిమెంట్స్ ఇచ్చింది తమ సంస్థలో పని చేస్తున్న ఉద్యోగుల వేతనాలు పెంచి వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపే ప్రయత్నం చేసింది. అమ్మకాల సిబ్బందికి బీమాతో పాటు హాస్పిటల్ ఖర్చులకు కూడా సాయం చేస్తామని చెప్పింది.ఉద్యోగులకు వేతనాల పెంపుతో ముందుకు సాగాలని ఎంచుకున్నట్లు తెలిపింది. ఖర్చులను తగ్గించుకునేందుకు, ఉద్యోగులపై భారం కాకుండా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నట్లు తెలిపింది. ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగులను తొలగించడం చేయలేమని, అలాగే కష్టపెట్టలేమని తెలిపింది.






