మంత్రి బాలినేని శ్రీనివాస్ కు కరోనా పాజిటివ్
ఆంధప్రదేశ్‌లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి కరోనా బారినపడ్డారు. కొన్ని రోజుల నుంచి స్వల్ప జ్వరంతో బాధపడుతున్న మంత్రి బాలినేని.. కరోనా పరీక్షలు చేయించుకోగా మొదట్లో నెగిటివ్ వచ్చింది. వైద్యుల సూచన మేరకు హైదరాబాద్‌లోని తన స్వగృహంలో హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నారు. అయితే జ్వరం వస్తూ పోతూ ఉండటంతో మంగళవారం మరోసారి కరోనా పరీక్షలు చేయించుకున్న బాలినేనికి పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. దీంతో ఆయన వెంటనే నగరంలోని అపోలో ఆస్పత్రిలో చేరారు. కాగా ప్రస్తుతం బాలినేని ఆరోగ్యంగానే ఉన్నారని ఆయన పీఆర్వో తెలిపారు. నేను ఆరోగ్యంగా ఉన్నాను. అపోలో ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నాను. త్వరలోనే ఇంటికి చేరుకుంటాను అని పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు మంత్రి సందేశం పంపారు.






