కమలాహారిస్ విమానం అత్యవసరంగా.. దారి మళ్లింపు
అమెరికా ఉపాధ్యక్షురాలు కమలాహారిస్ ప్రయాణిస్తోన్న ఎయిర్ఫోర్స్ 2 విమానాన్ని అత్యవసరంగా దారిమళ్లించాల్సి వచ్చింది. విండ్ షీర్ వల్ల ఈ పరిస్థితి తలెత్తింది. ఈ మేరకు ప్రెస్ సెక్రెటరీ కిర్స్టెన్ అలెన్ వెల్లడించారు. జార్జియా నుంచి కమలాహారిస్ ఎయిర్ ఫోర్స్2లో బయల్దేరారు. ప్రతికూల వాతావరణం కారణంగా దానిని డులెస్ ఇంటర్నెషనల్ ఎయిర్పోర్టుకు దారి మళ్లించారని అలెన్ తెలిపారు. తుపాను కారణంగా విమానం విండ్ షీర్కు గురైందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఆకస్మికంగా గాలి వేగం, దిశలో సంభవించే మార్పును విండ్ షీర్ అంటారు. దానివల్ల విమానం మార్గంలో మార్పు చోటుచేసుకుంటుంది. టేకాఫ్, ల్యాండింగ్ సమయంలో ఇది ఒక్కోసారి ప్రమాదకరంగా మారే అవకాశముంటుంది. ప్రస్తుత ఘటనలో ఉపాధ్యక్షురాలితో పాటు మిగిలిన సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు.







