TTA: డల్లాస్లో టిటిఎ ఫుడ్ డ్రైవ్ విజయవంతం
తెలంగాణ అమెరికా తెలుగు సంఘం (TTA) నూతన అధ్యక్షులు నవీన్ రెడ్డి మల్లిపెద్ది గారి నాయకత్వంలో మొట్టమొదటి కార్యక్రమం విజయవంతంగా జరిగింది. డల్లాస్( Dallas) లో ఫిబ్రవరి 25, 2024న ‘ఫీడ్ మై స్టార్వింగ్ చిల్డ్రన్’ సంస్థతో కలిసి ఫుడ్ డ్రైవ్ కార్యక్రమాన్ని టిటిఎ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో 27,864 భోజనాలను ప్యాక్ చేసి, 76 మంది పిల్లలకు ఏడాదికి అవసరమయ్యే విధంగా ఈ ఫుడ్ డ్రైవ్ నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి డెవలప్మెంట్ డైరెక్టర్ మరియు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ ప్రవీణ్ రెడ్డి చింతారెడ్డి, సేవాడేస్ కోఆర్డినేటర్ విశ్వ కంది, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ వెంకట్ అన్నపరెడ్డి, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ నరేష్ బైనాగారి, అలాగే ఆర్వీపీలు శేఖర్ రెడ్డి కుంటియెల్లన్నగారి, సందీప్ కట్టూరి, మహేష్ లక్కపల్లి, నిశాంక్ కుడితి మరియు ఆర్సీలు సహాయ సహకారాలు అందించారు.
ఈ సందర్భంగా అధ్యక్షుడు నవీన్ రెడ్డి మల్లిపెద్ది మాట్లాడుతూ ‘‘మనమందరం కలిసికట్టుగా గొప్ప కార్యక్రమాన్ని చేశాము. ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో మరింత చేపట్టి అవసరమైన వారికి ఆహారాన్ని అందించి, వారికిఆసరాగా నిలుద్దామని చెప్పారు. ఈ పుణ్య కార్యానికి తమ సమయాన్ని, శ్రమను ధారపోసిన స్వచ్ఛంద సేవకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.







