TTA: ఛార్లెట్‌లో వైభవంగా టిటిఎ బతుకమ్మ వేడుకలు

తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (TTA) ఛార్లెట్ చాప్టర్ ఆధ్వర్యంలో బతుకమ్మ ఉత్సవాలను వైభవంగా నిర్వహించారు. అధ్యక్షుడు నవీన్ రెడ్డి మల్లిపెద్ది నాయకత్వంలో నిర్వహించిన ఈ వేడుకలకు దాదాపు 3000 మందికి పైగా హాజరయ్యారు. తెలంగాణ సాంస్కృతిక సంప్రదాయాలకు, నార్త్ కరోలినాలోని తెలుగు కమ్యూనిటీ ఐక్యతకు నిదర్శనంగా నిలిచింది. ఈ వేడుకలకు ముఖ్య అతిధులుగా మార్విన్ మేయర్ జో పొలినో, భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి, ప్రముఖ యాంకర్ ఉదయభాను, మిమిక్రీ ఆర్టిస్ట్ రమేష్, గాయనీగాయకులు అదితి భావరాజు జనార్దన్ పన్నెల తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా అతిధులు టిటిఎ చేస్తున్న సేవా కార్యక్రమాలను, వేడుకలను ప్రశంసించారు.
ఈ వేడుకల విజయవంతానికి పలువురు నాయకులు కృషి చేశారు. శిరీష చింతకుంట ఈ ఈవెంట్‌ను లీడ్ చేశారు. నవ్య రెడ్డి కర్నాటి, కవిత గుండెటి శ్రవణ్ రెడ్డి కంది, వరుణ్ రెడ్డి తుమ్మలపల్లి, పల్లవి రెడ్డి రామిడి, సుక్ష్మ బచ్చిరెడ్డి, ప్రమోద్ కుమార్ చిలుక, సాయి ఈశ్వర్ గోగికర్, అనుష అంకాటి, మహతి గోర్స, అనుష, ప్రుణిత మల్లిపెద్ది, జ్యోతి అల్ల, ఝాన్సీ దేవరపల్లి, వారిజ, సతీష్, చైతన్య, అచ్యుత రెడ్డి నలబోలు, లక్ష్మీకాంత్ రెడ్డి రామిడి, నరేంద్ర దేవరపల్లి అభి ముదిరెడ్డి, మహి వాసిరెడ్డి, నీత తదితరులు ఈ వేడుకల విజయవంతానికి కృషి చేశారు.
ఈ వేడుక విజయలో కీలక పాత్ర పోషించిన వాలంటీర్లకు ప్రత్యేక అభినందనలను నిర్వాహకులు తెలియజేశారు. రమేష్ మెడబోయిన, అరవింద్ ఉత్తరమేరూర్, దీప్తి మిర్యాల, అరుణ్ కోతూర్, నిశాంత్ సిరికొండ, గోపాల్ కాసర్ల, దిలీప్ స్యాసాని, అంకుష్ వీరెడ్డి, శ్వేత గుండపనేని, మహేష్ గుండెటి, కవిత గుండెటి, సురేష్ గోర్స, రమేష్ నక్క, అహ్లాద్ కారెడ్డి, ప్రఫుల్ మస్కు, నిఖిత జూలకంటి, రమేష్ రెడ్డి చింతకుంట, శ్రీనివాస్ బండారి, వెంకట్ జమ్ముల, ప్రవీణ్ రెడ్డి, రాఘవేంద్ర చామల, మస్తాన్ రెడ్డి, భాగీరథ్, వంశీ కృష్ణ రెడ్డి గంట్ల, రవి, నరసింహ తదితరులు ఈ వేడుకల నిర్వహణకు సహకరించారు. కోనార్క్, దేశీ డిస్ట్రిక్ట్, విజన్ స్క్వేర్, ప్రైమ్ గ్రూప్, గోదావరి రెస్టారెంట్, మా స్పేసెస్, కవి కలెక్షన్స్, దేశీ లైఫ్ ఎక్స్‌పో మరియు ఖాన్ – సన్స్ జ్యువెలర్స్ వారు ఈ వేడుకలకు స్పాన్సర్లుగా వ్యవహరించారు.