అన్నమయ్య 613 వ జయంతి ఉత్సవాలు

తానా ప్రపంచ సాహిత్య వేదిక మే 30, ఆదివారం నిర్వహిచిన అన్నమయ్య 613 వ జయంతి ఉత్సవాలలో పాల్గొన్న అతిథులకు, విజయవంతం కావడంలో తోడ్పడిన ప్రతి ఒక్కరికి మా హృదయ పూర్వక కృతజ్ఞతలు.
ఈ కార్యక్రమం లో పోలాండ్ దేశస్థుడైన 12 ఏళ్ల జిబిగ్స్ అనే బాలుడు ప్రత్యేక, ఆకస్మిక అతిధిగా పాల్గొని అన్నమాచార్య కీర్తనలు గానం చేయడం ప్రత్యేకత. విశేషం ఏమిటంటే ఇతనికి తెలుగు తెలియనప్పటికీ తెలుగు భాష అంటే ప్రేమ, భారత దేశం అంటే ఎనలేని మక్కువ. జిబిగ్స్ గానం చేసిన కొన్ని పాటలు వినండి, ఆశీర్వదించండి.
ప్రసాద్ తోటకూర, తానా ప్రపంచ సాహిత్య వేదిక.