ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం ఆధ్వర్యంలో మాతృదినోత్సవ వేడుకలు

ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం వనితా వేదిక కార్యవర్గం మాతృదినోత్సవ వేడుకలను సంఘం అధ్యక్షులు శ్రీమతి లక్ష్మి అన్నపూర్ణ పాలేటిగారి ఆధ్వర్యంలో మే 9న వర్త్యువల్ గా జరిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా వివిధ రంగాలలోని ప్రముఖులైన మాతృమూర్తులు విచ్చేసారు.
డాక్టర్ కల్పలత గుంటుపల్లి, డాక్టర్ హేమ కొర్లకుంట్ల, శ్రీమతి సంధ్య గవ్వ, శ్రీమతి లలిత మూర్తి కుచిబొట్ల, శ్రీమతి గీత దమన్న, శ్రీమతి అన్నపూర్ణ నెహ్రు, శ్రీమతి రాజ్యం రావు ముఖ్య అతిథిలుగా విచ్చేసి మాతృమూర్తులుగా వారి అనుభవాలను పంచుకున్నారు.
ఈ కార్యక్రమన్ని శ్రీమతి అనురాధ సిరిగినిగారు ఎంతో ఉత్సాహంగా నిర్వహించారు. ముఖ్య అతిధులను చక్కటి ప్రశ్నలను అడుగుతూ కార్యక్రమాన్ని ఎంతో ఉల్లాసంగా కొనసాగించారు. వారందరు ఒక తల్లిగా, గ్రుహిణీగా, వృత్తి పరంగా ఎలా తమ జీవితంలో గెలుపు ఓటములని పొందారో ప్రేక్షకులకు వివరించారు. చివరకు వారికి ఇష్టమైన ఆహారం, సినిమాలతో కార్యక్రమం అంతా నవ్వులతో నిండింది. ఇంత సరదాగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు వచ్చిన వారందరు ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం అధ్యక్షులుశ్రీమతి లక్ష్మి అన్నపూర్ణ పాలేటి, శ్రీమతి అనురాధ సిరిగిని, శ్రీమతి నీరజా కుప్పాచి లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమానికి సంఘం అధ్యక్షులు శ్రీమతి లక్ష్మి అన్నపూర్ణ పాలేటి, వనితా వేదిక సమన్వయకర్త శ్రీమతి నీరజా కుప్పాచి తదితర కార్వవర్గ సభ్యులు మరియు పాలక మండలి సభ్యులు ముఖ్య అతిధులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.