తానా ఫౌండేషన్ ఆధ్వర్యంలో కర్నూలు జిల్లాలో నిత్యావసర సరుకులు పంపిణీ
కరోనా విపత్తు కష్టకాలంలో ప్రజలకు చేయూతనివ్వాలనే లక్ష్యంతో ఉత్తర అమెరికా తెలుగు సంఘం తానా ఫౌండేషన్ ఆధ్వర్యంలో కర్నూలు జిల్లాలో నిత్యావసర సరుకులు పంపిణీ చేపట్టారు. గురువారం పాణ్యం మండలంలోని సుగాలి మిట్ట, రాంభూపాల్ తండా తదితర గ్రామాల్లోని దాదాపు రెండువేల కుటుంబాలకు పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ద్వారా నిత్యావసర సరుకులు అందజేశారు.తానా ద్వారా జిల్లాలో చేపడుతున్నకార్యక్రమాలకు ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలియజేశారు.
తానా ఫౌండేషన్ ఛైర్మన్ నిరంజన్ శృంగవరపు, తానా కార్యదర్శి రవి పొట్లూరి సహకారంతో చేపడుతున్న కార్యక్రమాల్లో భాగంగా తానా ఫౌండేషన్ మరియు కర్నూలు ఎన్నారై ఫౌండేషన్ సహకారంతో సోమవారం కూడా కర్నూలు లో ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ ద్వారా కర్నూలు నగరంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేశామని, లాక్ డౌన్ విధించిన నాటి నుంచి కర్నూలు నగరంలోని పారిశుధ్య కార్మికులకు, నిరాశ్రయులకు, హైవే మీద వెళ్తున్న వారికి దాదాపు ముప్పయు వేలకు పైగా భోజనాలు అందజేశామని తానా కర్నూలు కార్యక్రమాల పర్యవేక్షకుడు బాలాజీ కాంటీన్ రాజశేఖర్ తెలిపారు.






