అస్టిన్లో తానా సాంస్కృతిక మెరుపులు
అమెరికాలో ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఆధ్వర్యంలో ఏటా తెలుగువారి కోసం, సేవా కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తోంది. కళాకారుల ప్రతిభ వెలికితీసేందుకు ఆగస్టు 24వ తేదీన అస్టిన్లో ఘనంగా ‘తానా కల్చరల్ కాంపిటీషన్ 2024’ నిర్వహించింది.
తానా కల్చరల్ సర్వీస్ కోఆర్డినేటర్ డాక్టర్ ఉమా కటికి(ఆరమండ్ల) పర్యవేక్షణలో తానా రీజినల్ రిప్రజెంటేటివ్ సుమంత్ పుసులూరి ఆధ్వర్యంలో ఈ పోటీలు జరిగాయి. ఈ కార్యక్రమంలో 100 మంది పాల్గొని తమ కళా ప్రతిభను ప్రదర్శించారు. కుటుంబసమేతంగా 400 మంది ఈ కార్యక్రమం వీక్షించారు. శాస్త్రీయ నృత్యాలు, సినిమా డాన్సులు వంటి వివిధ సాంస్కృతిక కళలను ప్రదర్శించారు. తానా సాంస్కృతిక కళా మహోత్సవం కార్యక్రమ నిర్వహణలో చిరంజీవి ముప్పనేని, శ్రీధర్ పోలవరపు, ప్రసాద్ కాకుమాను, బాలాజీ పర్వతనేని, లెనిన్ ఎర్రం, సతీష్ గన్నమనేని, సూర్య ముళ్ళపూడి, విగ్నేష్, శ్రీనివాస్ కొనకంచి, విజయ్ తదితరులు సౌత్ వెస్ట్ రీజియన్ తానా వాలంటీర్స్ భాగస్వాములు అయ్యారు.







