న్యూయార్క్ కు టీమిండియా… వెళ్తోంది వీళ్లే?
ప్రతిష్ఠాత్మక టీ20 వరల్డ్ కప్ టోర్నీ వామప్ మ్యాచ్‌ల తేదీలు వచ్చేశాయి. టీమిండియా జూన్ 1వ తేదీన బంగ్లాదేశ్ తో తొలి మ్యాచ్ ఆడనుంది. ఈ నేపథ్యంలో భారత క్రికెటర్లు న్యూయార్క్ విమానం ఎక్కేయనున్నారు. అయితే ఐపీఎల్ నాకౌట్ మ్యాచ్‌ల కారణంగా మే 25న కెప్టెన్ రోహిత్ శర్మ తో పాటు కొందరు మాత్రమే వరల్డ్ కప్ కోసం అమెరికా బయల్దేరనున్నారు. హిట్‌మ్యాన్‌తో పాటు వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా, సూర్య కుమార్ యాదవ్, రిషభ్ పంత్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రాలు న్యూయార్క్ వెళ్లనున్నారు. ఐపీఎల్ పదిహేడో సీజన్లో ఆఖరి ప్లే ఆఫ్స్ బెర్తు ఎవరిదో సీఎస్కే, ఆర్సీబీ మ్యాచ్‌తో తేలిపోనుంది. ఇప్పటికే టోర్నీ నుంచి ముంబై, లక్నో, ఢిల్లీ, పంజాబ్, గుజరాత్ జట్లు ఎలిమినేట్ అయ్యాయి. దాంతో, షెడ్యూల్ ప్రకారం ఐపీఎల్ లీగ్ దశ మగిశాక మొదటి బ్యాచ్ న్యూయార్క్ వెళ్లాలి.







