అమెరికాలో సూర్యాపేట జిల్లావాసి మృతి
అమెరికాలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లా ఆత్మకూర్ (ఎస్) మండలం పాతర్లపహాడ్ గ్రామానికి చెందిన తప్సి ప్రవీణ్‌కుమార్ (39) ప్రమాదవశాత్తు స్విమ్మింగ్ పూల్‌లో పడి మృతి చెందాడు. ప్రవీణ్‌కుమార్ వారి ఇంటి సమీపంలోని స్విమ్మింగ్ పూల్ వద్ద కాలక్షేపం కోసం వెళ్లి అందులో పడి మృతి చెందినట్లు అతడి భార్య శాంతి ఫోన్ ద్వారా కుటుంబ సభ్యులకు తెలిపారు. పాతర్లపహాడ్ గ్రామానికి చెందిన నాగయ్యకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె సంతానం. మృతుడు ప్రవీణ్ చిన్న కుమారుడు. ఎమ్మెల్సీ చేసిన ప్రవీణ్ హైదరాబాద్‌లో ఉపాధ్యాయుడిగా పని చేశారు. ఉపాధ్యాయ మృతిలో మంచి నైపుణ్యం ఉన్న ప్రవీణ్ ఆస్ట్రేలియా ఇతర దేశాల్లో ఉపాధ్యక్షుడిగా పనిచేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఐదేళ్ల క్రితం మిత్రులతో కలిసి అమెరికాకు వెళ్లిన ప్రవీణ్‌కుమార్ అట్లాంటా ప్రాంతంలో పనిచేస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రవీణ్ కుమార్ మృతితో పాతర్లపహాడ్ గ్రామంలో విషాదం నెలకొంది.







