TTA: టీటీఏ ఆధ్వర్యంలో వైభవంగా ‘శ్రీ సీతారామ కల్యాణం’

తెలంగాణ అమెరికా తెలుగు సంఘం (టీటీఏ) (TTA) ఆధ్వర్యంలో గ్రేటర్ ఫిలడెల్ఫియాలో ‘శ్రీ సీతారామ కల్యాణం’ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో పలువురు భక్తులు పాల్గొని భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి కృషి చేసిన వారందరికీ టీటీఏ (TTA) గ్రేటర్ ఫిలడెల్ఫియా నాయకులు డాక్టర్ నరసింహ రెడ్డి దొంతిరెడ్డి, ఆయన బృందం ధన్యవాదాలు తెలియజేసింది. టీటీఏ వ్యవస్థాపకులు డాక్టర్ పైళ్ల మల్లా రెడ్డి , అడ్వైజరీ చైర్ డాక్టర్ విజయపాల్ రెడ్డి, డాక్టర్ మోహన్ రెడ్డి పట్లోళ్ల (అడ్వైజరీ కో-చైర్), అడ్వైజరీ కౌన్సిల్ సభ్యులు, అధ్యక్షులు శ్రీ నవీన్ రెడ్డి మల్లిపెద్ది, కార్యనిర్వాహక కమిటీ, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ (బీవోడీ), ప్రాంతీయ ఉపాధ్యక్షులు (ఆర్వీపీలు), ప్రాంతీయ సమన్వయకర్తలు (ఆర్సీలు), అందరు ఫిలడెల్ఫియా టీటీఏ సభ్యులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమాన్ని చిరస్మరణీయంగా మార్చిన టీటీఏ (TTA) గ్రేటర్ ఫిలడెల్ఫియా బృందం సురేష్ వెంకన్నగారి, కిరణ్ గూడూరు, ప్రదీప్ కైదపురం, ప్రమోద్ చెవ్వా, వినయ్ మేరెడ్డి, రవీందర్ గట్ల, అనుదీప్ దిద్ది, వినయ్ కందుల, రాము నల్లవెల్లిలకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. గౌరవనీయులైన అతిథులు, టీటీఏ నాయకత్వం, ముఖ్యంగా న్యూజెర్సీ, టంపా నుంచి వచ్చి ఈ కార్యక్రమం కోసం చేయూతనందించిన జనరల్ సెక్రటరీ శివ రెడ్డి కొల్లా, రఘు అలుగుబెల్లి, నరేందర్ యరవలకు గ్రేటర్ ఫిలడెల్ఫియా బృందం, కళ్యాణం కమిటీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశాయి.
ఈ కార్యక్రమానికి సహకరించిన శ్రీరామ నవమి ప్రణాళిక బృందం సభ్యులు మల్లిక్ బుధవరపు, సుశాంత్ గోపిరెడ్డి, దినకరన్, మధు పాలెపు, రాఘవేందర్ వడ్డేపల్లి, మాల్యాద్రి మన్నం, సందీప్ కుందారపు, శ్రీకర్ గంప, సునీల్ కోత, సాయిరాం నగునూరి, గౌతమ్ నగర్, రాజు లడిల, పగరుద్ నగర్, రాజు లదిల కొత్తూరు కుటుంబానికి కూడా టీటీఏ (TTA) గ్రేటర్ ఫిలడెల్ఫియా నాయకత్వం అభినందనలు తెలియజేసింది. అలాగే రవి పొట్లూరి (తానా), రాజ్ కక్కెర్ల, సత్య పెద్దిరెడ్డి (ఆటా), రవి మైరెడ్డి అన్న (పీటీఏ), శ్రీధర్ గూడాల (ఎంఏటీఏ), రామ్మోహన్ తల్లూరి, సురేశ్ బొందుగుల (టీఏజీడీవీ), ఇతర ఆర్గనైజేషన్‌లతో పాటు రుచికరమైన ఆహారం మరియు ప్రసాదం ఏర్పాటు చేసిన స్పాన్సర్ బిర్యానీ సిటీ (డెలావేర్)కి టీటీఏ (TTA) గ్రేటర్ ఫిలడెల్ఫియా నాయకత్వం ధన్యవాదాలు తెలియజేసింది. అంతేకాకుండా ఈ వేడుకలు విజయవంతం చేయడానికి కృషి చేసిన నిరంజన్ దొంతి, భరత్ కొట్టాల, మల్లికా ప్రొడ్యూటర్, ఎస్పీ ఎలిగెంట్ బ్లైండ్స్, విస్తార్ ఫ్యాషన్స్, శుభం జ్యువెలరీ తదితరులకు టీటీఏ టీం కృతజ్ఞతలు తెలిపింది. అలాగే వేదికను సుందరంగా తీర్చిదిద్దిన ‘ది ఈవెంట్ ఫ్యాక్టరీ బై బి’ (భార్గవి)కి కూడా అభినందనలు తెలియజేసింది.