NJ: న్యూజెర్సీ సాయి దత్త పీఠం లో శ్రీ రామామృత శత గళార్చన !

న్యూ జెర్సీ (New Jersey) నగరం లో ఎడిసన్ లో సాయి దత్త పీఠం (Sai Datta Peetham) లో శ్రీ రామనవమి వేడుకలు అంగరంగ వైభవం గా జరిగిన విషయం తెలిసిందే !
ఆ వేడుకల్లో భాగంగా మహతి మ్యూజిక్ అకాడమీ వారి ఆధ్వర్యంలో దాదాపు వందకు పైగా పిల్లలు, మహిళలు సంగీతం తో శ్రీ రామామృత గానం చేసి అందరిని అలరించారు. ఈ కార్యక్రమంలో గురువు శ్రీమతి రేఖా బ్రహ్మసముద్రం శిక్షణ లో అందరూ భక్తి తో పాడగా శ్రోతలు పరవశించారు. ఈ కార్యకమం తెలుగు కళాసమితి అధ్యక్షులు శ్రీ మధు అన్న సమన్వయ పరచడమే కాకుండా, ఆయన కూడా పాల్గొనడం విశేషం.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ శత గళార్చన పేరుతో వంద మంది చిన్నారుల చేత శ్రీ రామ కీర్తనలు పాడించటం ఇది పదవ సంవత్సరం అని ఇన్ని సంవత్సరాలుగా శ్రీ రామనవమి పండుగ కు ఈ సంగీత నీరాజనం చేయటం చాలా అదృష్టమని శ్రీ మధు అన్న అన్నారు. మహతి మ్యూజిక్ అకాడమీ వారిని, శ్రీమతి రేఖా బ్రహ్మసముద్రం ని, పాడిన పిల్లలను అభినందనలు తెలియ చేసారు. తెలుగు టైమ్స్ పత్రిక ఎడిటర్ శ్రీ సుబ్బారావు చెన్నూరి మాట్లాడుతూ శ్రీ మధు అన్న ను, మహతి మ్యూజిక్ అకాడమీ పిల్లలను, గురువు శ్రీమతి రేఖా బ్రహ్మసముద్రం ను అభినందించారు.