Dallas: అమెరికాలో శ్రీ గణపతి సచ్చిదానంద స్వామిజీ ఆధ్యాత్మిక కార్యక్రమాలు

ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేవాలయాలను నిర్మించిన అవధూత దత్తపీఠాధిపతి (మైసూర్, ఇండియా) పరమపూజ్య శ్రీశ్రీశ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ టెక్సాస్‌లోని డల్లాస్ (Dallas) లో మరకత కార్యసిద్ధి హనుమాన్ దేవాలయము నిర్మించిన సంగతి, ఆ దేవాలయం ఎంతో విశిష్టతను సంతరించుకున్న సంగతి అందరికి తెలిసిందే. సర్వమత సామరస్యం, విశ్వశ్రేయస్సు, సంఘ సేవ కొరకు స్థాపించబడిన ఈ దేవాలయమలో దత్తాత్రేయ స్వామిని, దుర్గామాత, మహాశివ గణపతి మూర్తులు ప్రతిష్ఠ చేసి భక్తులందరకు అందించారు. అతి త్వరలో, (ఆగష్టు మాసంలో) పూజ్య స్వామిజీ శ్రీ వెంకటేశ్వర స్వామిని కూడా ప్రతిష్ట చేయనున్నారు ఇక్కడ పెరుగుతున్న పిల్లలకు, పెద్దలకు కూడా భగవద్గీత, సంగీతం, యోగ, భక్తిలాంటి ఎన్నో మంచి అంశాల మీద దేవాలయ నిర్వాహకుల నుండి ఎంతో మంచి శిక్షణ లభిస్తుంది. పూజ్యశ్రీ స్వామీజీ వారి ఆశీస్సులు అందుకుంటూ, వారి అనుగ్రహంతో వారి మార్గంలో పయనిస్తున్న వీరందరూ మంచి వ్యక్తిత్వంతో, మంచి పౌరులుగా తీర్చిదిద్దబడుతు న్నారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.
జులై 10వ తేదీన గురుపూర్ణిమ సందర్భంగా శ్రీ గణపతి సచ్చిదానంద స్వామిజీ డల్లాస్ నగరం లో క్రెడిట్ యూనియన్ అఫ్ టెక్సాస్ ఈవెంట్ సెంటర్‌లో 950కి పైగా భక్తులతో శ్రీ వెంకటేశ్వర వైభవం వేడుక నిర్వహించారు. స్వామీజీ నేతృత్వంలో జరిగిన ఈ గొప్ప కార్యక్రమంలో తొమ్మిది వందల యాభై ఐదు మంది కళాకారులు, గాయకులు మరియు వాయిద్యకారులు పాల్గొన్నారు, దీని ఫలితంగా అతిపెద్ద కర్ణాటక బ్యాండ్‌గా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ నమోదైంది. ఈ కార్యక్రమంలో ఆడిటోరియం మొత్తం శ్రీ వెంకటేశ్వర నామ సంకీర్తనతో ప్రతిధ్వనించింది. భక్త నాయకులు అందరూ శ్రీ స్వామిజీ ఆశీస్సులతో లోక రక్షకుడు మరియు వరదాత అయిన శ్రీ వెంకటేశ్వరుని కృపను కోరుతూ చేసిన ఒక చారిత్రాత్మక సమర్పణగా నిలిచింది.
శ్రీ స్వామిజీ డల్లాస్ వచ్చిన శుభ సందర్భంగా జూలై 4 వ తేదీ నుంచి క్రెడిట్ యూనియన్ అఫ్ టెక్సాస్ ఈవెంట్ సెంటర్‌లో అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. శ్రీ సచ్చిదానంద స్వామీజీ ‘శ్రీ శ్రీనివాస రాగసాగర’ అనే ‘మ్యూజిక్ ఫర్ మెడిటేషన్ అండ్ హీలింగ్’ జశీఅషవత్‌ీను పద్మ విభూషణ ణతీ. ూ. సుబ్రహ్మణ్యం గారితో నిర్వహించారు. ఈ నాద చికిత్స కార్యక్రమానికి వేలాది మంది హాజరై, శ్రీ స్వామీజీ అనుగ్రహానికి పాత్రులయ్యారు. పూజ్య శ్రీ స్వామీజీకి సంగీతమే భాష, సంగీతమే మతము, సంగీతమే శ్వాస, సంగీతమే భావం శ్రీ స్వామిజీ ఆశీస్సులతో, ఆయన నేతృత్వంలో జరిగిన మరొక గొప్ప కార్యక్రమం – సంపూర్ణ భగవద్గీత పారాయణ మహాయజ్ఞం. ఈ కార్యక్రమంలో హాజరైన వేలాది మందిలో సగం మంది కంటే ఎక్కువ భగవద్గీత లోని 18 చాప్టర్‌లలో అన్ని శ్లోకాలు కంఠస్థం చేసి పారాయణం చేశారు. వీరంతా ప్రవాస భారతీయులు మాత్రమే. ఈ పారాయణ కార్యక్రమంలో పాల్గొన్న వారిలో చిన్న పిల్లల నుంచి, వృద్ధుల వరకు ఉన్నారు. చిన్నపిల్లలు ఎక్కువగా పారాయణం చేసిన ఈ కార్యక్రమం అంతా ఏక కంఠంతో, మధుర స్వరంతో, ఎంతో క్రమశిక్షణతో జరిగింది. ఇంతటి విశేషమైన కార్యక్రమంలో అమెరికాలో జరగడం, ఈ కార్యక్రమానికి వేలాది మంది ప్రవాస భారతీయులు హాజరవడం ఎంతో అద్భుతమైన విషయంగా అందరూ భావించారు.
– శ్రీమతి మంజరి చెన్నూరి, డల్లాస్