కొవిడ్ లక్షణాలను గుర్తించే యాప్
కొవిడ్ లక్షణాలున్న వారిని గుర్తించే ఒక యాప్ను బోస్టన్లోని శాస్త్రవేత్తలు రూపొందించారు. దీని ద్వారా హాట్స్పాట్ కేంద్రాల్లో అనుసరించాల్సి వ్యూహాలను కూడా తెలుసుకోవచ్చు. కరోనాపై పోరాడుతున్న ప్రజారోగ్య సిబ్బందికి ఈ యాప్ బాగా ఉపకరిస్తుంది. మార్చిలో ఆవిష్కరించిన ఈ యాప్ను ఇప్పటికే అమెరికా, బ్రిటన్ దేశాల్లో 25 లక్షల మంది ఉపయోగిస్తున్నారు. అక్కడి డాక్టర్లు, శాస్త్రవేత్తలు, ప్రభుత్వ అధికారులు వారికి కావాల్సిన రోజువారీ సమాచారాన్ని దీని ద్వారా పొందుతున్నారు. దీని ఫలితాల ఆధారంగా శాస్త్రవేత్తలు వైరస్ తీవ్రతపై ఒక అవగాహనకు వస్తున్నారు.






