Ohio: కొలంబస్ ఒహాయోలో వైభవంగా శత సహస్ర లింగార్చన, కుంకుమార్చన పూజలు

గత 25 ఏళ్లుగా అమెరికాలో ముఖ్యంగా కొలంబస్ ఒహయో (Ohio) లో ఉంటున్న తెలుగు ప్రముఖులు జగదీష్ ప్రభల గత సంవత్సరం హైదరాబాద్ పెద్దమ్మ గుడి నుంచి వచ్చిన ప్రధాన పురోహితులు శ్రీ చంద్రమౌళి శర్మతో కలిసి నగరంలో వున్న లక్ష్మీ గణపతి టెంపుల్ (Lakshmi Ganapati Temple) యాజమాన్య భాద్యతలు తీసుకోవడం జరిగింది. ఆ సమయంలోనే శ్రీ జగదీష్ ఒక హిందూ ఫెస్ట్ ( %నఱఅసబ ఖీవర్ ) చేస్తే బావుంటుంది అని ఒక కాన్సెప్ట్ గురించి కొంత మంది మిత్రులతో చెప్పడం కూడా జరిగింది. టీవీ5 యాజమాన్యం హిందూ ధర్మం టీవీ ప్రసారాలు అమెరికాలో ప్రారంభించాలని అనుకొవడం, ఇండియా అమెరికాలకు అనేక విషయాల్లో సంధానకర్తగా ఉన్న శ్రీ ప్రసాద్ గారపాటి సలహాలతో టివీ 5 చైర్మన్ శ్రీ బి ఆర్ నాయుడు , మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ రవీంద్రనాథ్ అమెరికాలో హిందూ ధర్మం టీవీ నిర్వహణ బాధ్యత జగదీష్ ప్రభలకు అప్పగించడం అనుకోకుండా మరియు అదృష్టవశాత్తు జరిగిన విషయం అని చెప్పొచ్చు.
హిందూధర్మం టీవీ అమెరికా వస్తున్న ఈ సమయంలో తన మది లో వున్న, ఎప్పటినుంచో అనుకొంటున్న హిందూ ఫస్ట్ కార్యక్రమం కొలంబస్ ఒహాయోలో చేయాలని జగదీష్ ప్రభల అనుకోవడం ఒక దైవ నిర్ణయంగా భావించాలి?. ఎందుకంటే ఆయన తలపెట్టిన లక్ష శివలింగ అర్చన కొలంబస్‌లో ఒక యజ్ఞమే అని చెప్పొచ్చు లక్ష శివలింగాలు తయారుచేయడం, వాటన్నిటిని శాస్త్రోక్తంగాఅమర్చి పూజ చేయటం అన్నది చిన్న విషయం కాదు. శ్రీ జగదీష్‌నగరంలో వున్న అందరితోనూ తన ఆశయం చెప్పటం, దానికి అనేక మంది మద్దతు తెలుపుతూ ముందుకు రావడం జరిగింది. మొదటగా శివ లింగాలు చేయటానికి కావాల్సిన మన్ను తెప్పించి, నగరం లోని భక్తులను వాలంటీర్లు గా పిలిపించి శివ లింగాలు చేసే పని మొదలుపెట్టడం జరిగింది. ఆ ఆరువాత శ్రీ జగదీష్, శ్రీ నరేష్ ఇందూరి, శ్రీ చరణ్ మరియు చిన్మయ మిషన్ వారితో కలిసి ఇండియా వచ్చి శ్రీశైలం నుంచి బంక మన్ను, పసుపు, కుంకుమ, అక్షతలు తీసుకోవటం, కుంభమేళ సమయంలో ప్రయాగ వెళ్ళి అక్కడి నుంచి గంగాజలం తీసుకోవటం, మధుర మీనాక్షి టెంపుల్ నుంచి కుంకుమ తీసుకోవడం, ఇండియా లోని అనేక పుణ్యక్షేత్రాలను నుంచి పూజా సామాగ్రి తీసుకోవటం దాదాపు 100 కేజీల సామాగ్రి ని ఇండియా నుంచి కొలంబస్ పంపండం జరిగింది.
ఈ కార్యక్రమ నిర్వహణలో శ్రీ జగదీష్ ప్రభల అనుసరించిన తీరు ఈవెంట్ మేనేజ్మెంట్ లో ఒక కొత్త పోకడ అని చెప్పాలి. వాలంటీర్లు , స్నేహితులు, శ్రేయోభిలాషులు దాదాపు 400 మందితో ఒక వాట్సప్ గ్రూప్ తయారు చేసి ప్రతి రోజూ అందులో ఫోటోలు, వీడియో ల ద్వారా కార్యక్రమ వివరాలు ఇచ్చే విధానం వలన ఎప్పటికప్పుడు కొత్త వాలంటీర్లు ఈ శత సహస్ర లింగార్చన, శత సహస్ర కుంకుమార్చన కార్యక్రమంలో భక్తి తో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి శ్రీ జగదీష్ ప్రతి రోజూ జరుగుతున్న వివరాలు తెలుపుతూ అందరిని ఉత్తేజ పరిచిన విధానం కూడా కారణంగా చెప్పాలి. లక్ష శివలింగాలు చేయడానికి కావలసిన కావలిసిన మట్టిని తెప్పించడం ఒక ఎత్తు అయితే వాలంటీర్ల ను ఉత్తేజపరుస్తూ వారి చేత చేయించడం మరొక ఎత్తు అని చెప్పాలి.
ఆ తర్వాత 4ఫీట్ `శ 4ఖ్‌ీ% చెక్కలను ఆర్డర్ చేసి తెప్పించి, 8-9 మార్చి తేదీలలో ఆ చెక్కలకు బోర్డర్లు బిగించటం, రంగులు వేయడం, వాటిని ఒక పెద్ద ట్రే లాగా తయారు చేయడం కూడా ఒక పెద్ద కార్యక్రమం అని చెప్పాలి. ఆ తర్వాత శ్రీ లక్ష్మీ గణపతి టెంపుల్ యజమానులు మరియు పురోహితులు అయిన శ్రీ చంద్రమౌళి శర్మ గారు మరియు ఇతర పండితుల సలహా సూచనల ప్రకారం ఒక ఒక శాస్త్రీయ పద్ధతి ద్వారా శివలింగాలను అమర్చడం జరిగింది. ఆ విధంగా ఒకొక్క ట్రేలో 116 శివలింగాలు చొప్పున 90 ట్రేలలో అమర్చిన 100000 శివ లింగాలు, అనేకమంది సమర్పించిన పూజ సామాగ్రితో చిన్మయ మిషన్ మార్చి 22వ తేదీన అమెరికాలో మొట్టమొదటిసారిగా జరిపే శత సహస్ర లింగార్చన, కుంకుమార్చనకు వేదిక తయారు అయ్యింది. తరువాత కార్యక్రమం విజయవంతమైంది.
ఈ దైవ కార్యక్రమానికి కొలంబస్ ఒహయో లో వున్న తెలుగు సంఘాలు, ఇతర వర్గాల ప్రతినిధులు వాలంటీర్లు గా పనిచేయడం జరిగింది. ఈ బృహత్ కార్యక్రమానికి అనేక మంది దాతలు కూడా ముందుకు రావడం జరిగింది. దాతల క్యాటగిరిని బట్టి పూజా కార్యక్రమంలో సీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగా మహిళలచే లక్ష కుంకుమార్చన కార్యక్రమం, ఆ తరువాత లక్ష శివలింగార్చన కార్యక్రమం వేదమంత్రాలతో అత్యంత భక్తి శ్రద్ధలతో జరిగింది. భక్తులు అందరూ పూజా కార్యక్రమం తరువాత తీర్ధ ప్రసాదాలు తీసుకొని వెళ్లారు.
హిందూ ధర్మం టీవీ యాంకర్ లావణ్య శ్రీనాథ్ వచ్చిన ముఖ్యమైన అతిధులను ఇంటర్వ్యూ చేయడం, మొత్తం కార్యక్రమం హిందూ ధర్మం టీవీలో, యూప్‌టివీ లో లైవ్ క్యాస్ట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని 7,25,000 మంది యూప్‌టివీ, హిందూ ధర్మం టీవీ ద్వారా, యూట్యూబ్ టీవి ద్వారా 15,000 మంది చూశారు. 1200 మంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు
కార్యక్రమం గురించి శ్రీ జగదీష్ ప్రభల మాట్లాడుతూ, 2500 కేజీల క్లే, 1500 కేజీల ఫ్లైవుడ్, 500 కేజీల పూజ ఐటమ్స్ 200 కేజీలపూలు 200 కేజీల ఫ్లెక్సీ బ్యానర్స్ ఈ కార్యక్రమానికి వాడటం జరిగిందని తెలిపారు. అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారి గురించి జగదీష్ ప్రభల మాట్లాడుతూ అనేకమంది పురోహితులు, శ్రీ లక్ష్మీ గణపతి టెంపుల్ ట్రస్టీలు, చిన్మయ మిషన్ గ్రూప్, శంభో మహా దేవగ్రూప్, ఆప్కో, సిటిఎ, ఎఫ్‌ఐఎ, టాకో, టీవీ 5, విజువల్ యాడ్స్, సేవా ఇంటర్నేషనల్, తెలుగుటైమ్స్, హిందూ ధర్మంటీవీ వారు అనేక విధాలుగా సహాయ పడ్డారని, వారందరికీ ధన్యవాదాలను తెలియజేశారు.