Ganesh Chaturthi: అమెరికాలో బాల్టిమోర్ నగరంలో సాయి మందిర్ గణేష్ పూజలు

అమెరికాలోని బాల్టిమోర్ నగరంలో ఉన్న సాయి మందిర్‌లో గణేష్ చతుర్థి (Ganesh Chaturthi) పూజలు ఘనంగా జరిగాయి. ఈ పూజా కార్యక్రమాల్లో 250 మందికిపైగా భక్తులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన లడ్డూ వేలం ఉత్కంఠ భరితంగా సాగింది. చివరకు ప్రవీణ్, ప్రవీణ తీగల దంపతులు 1200 డాలర్లకు లడ్డూను గెలుచుకున్నారు. ఈ సొమ్ముతో ఆలయానికి ఎంతో మేలు జరుగుతుందని నిర్వాహకులు వెల్లడించారు. ప్రవీణ్ దంపతుల భక్తి, ఉదారతను అందరూ కొనియాడారు. వినాయకుని ఆశీస్పులతో వారు ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని ఆశీర్వదించారు. కాగా, వినాయక చవితి (Ganesh Chaturthi) వేడుకల్లో నిమజ్జన కార్యక్రమాలకు ముందు లడ్డూ వేలం నిర్వహించడం ఎంతోకాలంగా సంప్రదాయంగా వస్తున్న సంగతి తెలిసిందే. ఈ లడ్డూ ప్రసాదాన్ని కుటుంబ సభ్యుల్లో పంచుకుంటే మంచి జరుగుతుందని భక్తులు నమ్ముతారు.